CM Siddaramaiah : వైద్యులు క‌నిపించే దేవుళ్లు

ప్ర‌పంచ డాక్ట‌ర్ల దినోత్స‌వం

CM Siddaramaiah : డాక్ట‌ర్ల గురించి ఎంత చెప్పినా త‌క్కువే. వైద్య రంగం అత్యంత కీల‌కంగా మారింది. మారుతున్న ప‌రిస్థితుల దృష్ట్యా కోట్లాది మంది నిత్యం ఏదో ఒక రోగం బారిన ప‌డుతున్నారు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మాన‌వ స‌మాజం ఎన్నో మార్పుల‌కు లోన‌వుతూ వ‌చ్చింది. ఇదే క్ర‌మంలో వైద్యం మ‌రింత ఆధునిక‌త‌ను సంత‌రించుకుంది. పెను సంచ‌నాల‌కు కేంద్ర బిందువుగా మారింది.

వైద్యులు అందిస్తున్న సేవ‌లు ప్ర‌శంస‌నీయం. స‌ర్వదా అభినంద‌నీయం కూడా. ప్ర‌పంచ వ్యాప్తంగా జూలై 1న డాక్ట‌ర్స్ డే నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు. ప్ర‌తి ఏటా ఇది కొన‌సాగుతోంది. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, క‌ర్ణాట‌క సీఎం సిద్ద‌రామ‌య్య(CM Siddaramaiah) వైద్యుల దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని శుభాకాంక్ష‌లు తెలిపారు .

ఆరోగ్య వంత‌మైన స‌మాజాన్నినిర్మించ‌డంలో వృత్తి ప‌రంగా వైద్యులు అంద‌జేస్తున్న సేవ‌లు ప్ర‌శంస‌నీయ‌మ‌ని పేర్కొన్నారు సిద్ద‌రామ‌య్య‌. ప్ర‌తి విలువైన ప్రాణాన్ని సంర‌క్షించ‌డం, రక్షించ‌డం అనే స‌వాలును నిరంత‌రం స్వీక‌రిస్తూ నిబ‌ద్ధ‌త‌తో విధులు నిర్వ‌హిస్తున్న ప్ర‌తి ఒక్కరికీ పేరు పేరునా శుభాకాంక్ష‌లు తెలిపారు సీఎం.

దేశంలోని వైద్య సోద‌ర‌, సోద‌రీమ‌ణులంద‌రికీ జాతీయ వైద్యుల దినోత్స‌వ అభినంద‌న‌లు తెలిపారు సిద్ద‌రామ‌య్య‌.

Also Read : KTR STP : కోకాపేట‌లో ఎస్టీపీ సిద్ధం – కేటీఆర్

Leave A Reply

Your Email Id will not be published!