Archana Joshi removed : రైలు ఘటన ఎఫెక్ట్ జీఎంపై వేటు
అర్చనా జోషి అవుట్ అనిల్ కుమార్ మిశ్రా ఇన్
Archana Joshi removed : దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది ఒడిశా రైలు దుర్ఘటన. ఈ ఘటనలో భారీ ఎత్తున ప్రాణ నష్టం చోటు చేసుకుంది. లెక్కకు మించి చని పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. విచారణకు కమిటీ వేసింది. ఇప్పటి వరకు నివేదిక రాలేదు. మరో వైపు ప్రమాదాల నివారణకు సేఫ్టీ పరికరాలను అమర్చక పోవడం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుందని విపక్షాలు ఆరోపించారు. ఈ విషయం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు మాజీ కేంద్ర రైల్వే శాఖ మంత్రి, ప్రస్తుత సీఎం మమతా బెనర్జీ.
ఇదిలా ఉండగా కేంద్ర సర్కార్ రంగంలోకి దిగింది. ఈ మేరకు రైల్వే శాఖ కీలక మార్పులు చేసింది. ఒడిశా రైలు దుర్ఘటన తర్వాత సౌత్ ఈస్టర్న్ రైల్వే జనరల్ మేనేజర్ గా ఉన్న అర్చనా జోషిని(Archana Joshi) తొలగించారు. ఈ మేరకు ఆమె స్థానంలో అనిల్ కుమార్ మిశ్రాను నియమిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈమేరకు క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదించినట్లు తెలిపింది. శనివారం కీలక ప్రకటన చేసింది రైల్వే శాఖ.
ఇదిలా ఉండగా గత నెల జూన్ లో ఒడిశా లోని బాలాసోర్ లో మూడు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 270 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు నెల రోజుల తర్వాత ఆమెను తొలగించడం విశేషం. కాగా రైల్వే శాఖా మంత్రి వైష్ణవ్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు పట్టుపట్టాయి.
Also Read : CM Shinde : బస్సు ప్రమాదం బాధాకరం – సీఎం
