CM Siddaramaiah : శెట్టర్..బోస రాజు..తిప్పన్నలకు కంగ్రాట్స్
అభినందించిన సీఎం సిద్దరామయ్య
CM Siddaramaiah : కర్ణాటక విధాన సభలో కొత్తగా శాసన మండలి సభ్యులు (ఎమ్మెల్సీలు) గా ఏకగ్రీవంగా ఎన్నికైన జగదష్ శెట్టర్ , ఏఐసీసీ కార్యవర్గ సభ్యుడు బోస రాజు , తిప్పన్న కమకనూర్ లను ప్రత్యేకంగా అభినందించారు సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah). ఈ సందర్బంగా అపారమైన అనుభవం కలిగిన నేతలు విధాన సభకు రావడం ఆనందంగా ఉందన్నారు.
బోస రాజు కాంగ్రెస్ పార్టీలో కొన్నేళ్లుగా విశిష్ట సేవలు అందిస్తున్నారు. కీలకంగా వ్యవహరించారు. పార్టీ కీలక నిర్ణయాలలో తనదైన ముద్ర కనబర్చారు. ఇక జగదీష్ శెట్టర్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కారణం ఏమిటంటే ఆయన కరుడు గట్టిన కాషాయ వాదిగా గుర్తింపు పొందారు. ఆర్ఎస్ఎస్ భావ జాలం కలిగి ఉన్నారు. అంతే కాదు ఒకసారి కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశారు. పొలిటికల్ గా మోస్ట్ పాపులర్ లీడర్ గా గుర్తింపు పొందారు జగదీష్ శెట్టర్.
తాజాగా కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. అధికారంలో ఉన్న బీజేపీ హైకమాండ్ శెట్టర్ కు టికెట్ ఇవ్వలేదు. దీంతో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆపై పార్టీ శెట్టర్ కు అరుదైన ఛాన్స్ ఇచ్చింది. ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించింది. ఆయనకు కర్ణాటక రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ పోస్టు ఇస్తారని ప్రచారం జరిగింది.
Also Read : YS Jagan : గ్రామ స్వరాజ్యం జగన్ లక్ష్యం
