Alluri Sitarama Raju : విప్లవ వీరుడు మన్నెం సూరీడు
అల్లూరి సీతారామ రాజు జయంతి
Alluri Sitarama Raju : ఆంగ్లేయుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన యోధుడు శ్రీ అల్లూరి సీతారామ రాజు. బ్రిటీష్ ల దాష్టీకాలను ప్రశ్నించారు. దౌర్జన్యాలను నిరసించాడు. అడవి బిడ్డల కోసం తను నిలబడ్డాడడు. ప్రాణ త్యాగం చేసిన యోధుడు అల్లూరి సీతారామ రాజు. దేశ స్వాతంత్రం కోసం పోరాడిన యోధుడు. కేవలం 27 ఏళ్లకే ప్రాణాన్ని పణంగా పెట్టిన ధీరుడు.
బ్రిటీషర్లకు రెండు సంవత్సరాల పాటు కంటి మీద కునుకు లేకుండా చేశాడు. తనను నమ్మిన వారికి న్యాయం చేసేందుకు శ్రమించాడు. రేయింబవళ్లు తను ప్రాణ ప్రదంగా మారిన గొప్ప వ్యక్తి అల్లూరి సీతారామ రాజు(Alluri Sitarama Raju).
ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లా పాండ్రంగిలో జూలై 4న 1897లో పుట్టాడు. కానీ పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లులో పెరిగారు అల్లూరి సీతారామ రాజు. తండ్రి వెంకట రామ రాజు. తల్లి సూర్య నారాయణమ్మ. 9 వరకు చదివిన సమయంలోనే సంస్కృతం, జ్యోతిష్యం, జాతక శాస్త్రం, విలు విద్య, గుర్రపు స్వారీలో తర్ఫీదు పొందాడు. 1917లో మన్యంలోకి అడుగు పెట్టారు. ఆంగ్లేయుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా అడవి బిడ్డలను చైతన్యవంతం చేశాడు శ్రీ అల్లూరి సీతారామ రాజు.
గంటం దొర , అనుచరుల సాయంతో బ్రిటిషర్లపై యుద్దం ప్రకటించాడు. 1922 ఆగస్టు 22న చింతపల్లి పోలీసు ఠాణాపై దాడి చేశాడు. 23న క్రిష్ణదేవి పేట , 24న తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి స్టేషన్ పై దాడిచేశారు. మన్యం వీరుడిని మట్టు పెట్టేందుకు ఇంగ్లీషోల్లు ప్లాన్ చేశాడు. 1924 మే 7న మంప సమీపంలో లొంగి పోయాడు. సీతా రామ రాజుపై పగతో రగిలి పోతున్న అతడిని కాల్చి చంపింది.
Also Read : Raghunandan Rao : నిన్న ధిక్కారం నేడు మారిన స్వరం
