Nara Lokesh : అమూల్ చిత్తూరు డెయిరీ డీల్ ఎంత
నిప్పులు చెరిగిన టీడీపీ నేత నారా లోకేష్
Nara Lokesh : టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. మంగళవారం యువ గళం పాదయాత్ర సందర్భంగా ఏపీ సీఎం జగన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. చిత్తూరు ప్రభుత్వ డెయిరీని అమూల్ సంస్థకు ఎందుకు అప్పగించారో చెప్పాలని, ఎంత డీల్ కుదుర్చుకున్నారో జనాలకు చెప్పాలని డిమాండ్ చేశారు నారా లోకేష్(Nara Lokesh). సీఎం విశ్వసనీయతను ప్రశ్నించారు.
రాష్ట్రంలో సహకార డెయిరీలను నట్టేట ముంచుతున్నాడని ఆరోపించారు. కమీషన్లకు కక్కుర్తిపడి అప్పనంగా ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ ప్రధాన కార్యదర్శి. పాడి రైతుల సంక్షేమానికి తూట్లు పొడిచేలా చర్యలు తీసుకోవడం దారుణమని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవాల్సిన చిత్తూరు పాల డెయిరీని ఎందుకు అమూల్ డెయిరీకి అప్పగిచారంటూ మండిపడ్డారు.
ఇదిలా ఉండగా 1990 ప్రారంభంలో అతి పెద్ద పాల కేంద్రాలలో ఒకటిగా గుర్తింపు పొందిన చిత్తూరు డెయిరీ నష్టాల కారణంగా మూత పడింది. 2005లో అప్పటి సీఎం వైఎస్ఆర్ ఏర్పాటు చేసిన హౌస్ కమిటీ విచారణ చేపట్టింది. నష్టాల వల్లే డెయిరీ మూత పడిందని తేల్చింది. ఇదిలా ఉండగా 99 ఏళ్ల పాటు డెయిరీని ఏడాదికి కోటి చొప్పున అమూల్ కు సీఎం జగన్ కట్టబెట్టడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు నారా లోకేష్.
Also Read : Indian Consulate Attack : భారత కాన్సులేట్‌కు నిప్పు
