Merugu Nagarjuna : సామాన్యుడిలాగా ఏపీ మంత్రి జర్నీ
ఏపీ మంత్రి మేరుగు నాగార్జున
Merugu Nagarjuna : ఎవరైనా మంత్రి అయితే హుంగు ఆర్భాటం ఉంటుంది. కానీ ఏపీకి చెందిన మేరుగు నాగార్జున కొంచెం ఇందుకు భిన్నంగా ఉంటారు. ఎక్కడా డాబు దర్బాన్ని ప్రదర్శించాలని అనుకోరు. అందుకే ఆయనంటే చాలా మంది ఇష్టపడతారు. అంత కంటే ఎక్కువగా గౌరవిస్తారు. తాజాగా తెలంగాణకు చెందిన ప్రముఖ గాయకుడు సాయి చంద్ అనుకోకుండా హఠాన్మరణం చెందారు. విషయం తెలుసుకున్న మంత్రి మేరుగు నాగార్జున హుటా హుటిన హైదరాబాద్ కు చేరుకున్నాడు.
సాయిచంద్ ఇంటికి వెళ్లి నివాళులర్పించారు. ఆపై నగరంలో సామాన్యుల లాగానే మెట్రో రైలులో ప్రయాణం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది. ఇక మంత్రి మేరుగు నాగార్జున(Merugu Nagarjuna) తో పాటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి కూడా ఉన్నారు. మొత్తంగా సింప్లిసీటీ ఒకరు చెబితే రాదని జన్మతః రావాలని నెటిజన్లు పేర్కొంటున్నారు.
ఏపీలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు మేరుగు నాగార్జున. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం వెల్లటూరు ఊరు. జూన్ 15, 1966లో పుట్టారు. 2019లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వేమూరు శాసన సభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. జగన్ కేబినెట్ లో కొలువుతీరారు. ఆంధ్రా యూనివర్శిటీ నుండి డాక్టరేట్ కూడా పొందారు. గతంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ గా కూడా పని చేశారు. మొత్తంగా మేరుగు నాగార్జున హాట్ టాపిక్ గా మారారు. ఇలాంటి మంత్రులు మనకూ ఉన్నారా అంటే లేరని చెప్పక తప్పదు.
Also Read : Nara Lokesh : అమూల్ చిత్తూరు డెయిరీ డీల్ ఎంత
