RS Praveen Kumar : ఆదివాసీ బిడ్డలపై కేసీఆర్ వివక్ష
బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
RS Praveen Kumar : బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. కేవలం ఓట్ల కోసం ఆదివాసీల జపం చేస్తున్నారంటూ ఆరోపించారు. గురువారం ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. ఆదివాసీ బిడ్డల పట్ల ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి ప్రదర్శిస్తోందంటూ ఆరోపించారు. కేసీఆర్ కనబరుస్తున్న ప్రేమ నాటకమని ఆరోపించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
పేద బిడ్డలు చదువుకునే ఆశ్రమ పాఠశాలలకు గత ఏడాది నుండి చిల్లి గవ్వ కూడా విడుదల చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా పేద బిడ్డలను చదువుకు దూరం చేసే కుట్రగా అభివర్ణించారు. ఆది వాసీల పిల్లలను శాశ్వతంగా చీకటిలోకి నెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నాడంటూ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో బీఎస్పీ చీఫ్ ధ్వజమెత్తారు.
కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను నాశనం చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ప్రత్యేకించి ఆదివాసీలకు చెందిన ఆశ్రమ పాఠశాలలలో కనీస సౌకర్యాలు కూడా లేవని వాపోయారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar). ప్రత్యేకించి విద్యా రంగాన్ని భ్రష్టు పట్టించారని, ఆరోగ్య రంగాన్ని సర్వ నాశనం చేశారంటూ ఆరోపించారు. ఇప్పటి వరకు ఆశ్రమ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ , నాన్ టీచింగ్ స్టాఫ్ ను భర్తీ చేయలేదని పేర్కొన్నారు.
Also Read : Shiv Raj Singh Chouhan : బాధితుడి పాదాలు కడిగిన సీఎం
