YS Sharmila : బీఆర్ఎస్ బీజేపీకి బి టీమ్ – షర్మిల
షాకింగ్ కామెంట్స్ చేసిన వైఎస్సార్ టీపీ చీఫ్
YS Sharmila : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్ చేశారు. భారత రాష్ట్ర సమితి పార్టీ బీజేపీకి బి టీమ్ అని ఆరోపించారు. ఇవాళ ఈనెల 8న వరంగల్ లో పర్యటించే మోదీ సభకు ఆ పార్టీ కావాలని సపోర్ట్ చేస్తోందంటూ మండిపడ్డారు. కేసీఆర్ , బీజేపీ ఒక్కటి కాదని పదే పదే కేటీఆర్ చెప్పినా ఎవరూ నమ్మే స్థితిలో లేరని పేర్కొన్నారు.
కొడుకు కేటీఆర్, కూతురు కవిత అడ్డంగా బుక్కయ్యారని గత్యంతరం లేక బీజేపీతో కాంప్రమైజ్ అయ్యారంటూ ఆరోపించారు వైఎస్ షర్మిల(YS Sharmila). నిన్నటి దాకా దర్యాప్తు సంస్థలన్నీ గగ్గోలు పెట్టాయని, అదిగో అరెస్ట్ అంటూ ఊరించారని కానీ తీరా చూస్తే ఎవరూ అరెస్ట్ కాక పోగా ఊహించని రీతిలో ప్రచారం మాత్రం వచ్చిందంటూ ఎద్దేవా చేశారు.
కేసుల నుంచి బయట పడేందుకు ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాకు లొంగి పోయారని ఆరోపించారు వైఎస్ షర్మిల. ఇది తాను అనడం లేదని యావత్ తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారని స్పష్టం చేశారు.
గత తొమ్మిది సంవత్సరాలుగా విభజన హామీల గురించి ఎందుకు బీఆర్ఎస్ ప్రశ్నించ లేదని నిలదీశారు . రాష్ట్రానికి రావావాల్సిన నిధుల గురించి ఎందుకు అడగ లేదన్నారు. లిక్కర్ స్కాంలో బిడ్డ అడ్డంగా దొరికినా బేడీలు ఎందుకు వేయలేదంటూ మండిపడ్డారు.
Also Read : Tamim Iqbal : తమీమ్ కంట తడి క్రికెట్ కు గుడ్ బై
