TTD Chairman : ఎస్వీబీసీ ఛాన‌ల్ కు ప్ర‌పంచ గుర్తింపు

విస్తృతంగా ధ‌ర్మ ప్ర‌చార కార్య‌క్ర‌మాలు

TTD Chairman : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ కు విశ్వ వ్యాప్తంగా గుర్తింపు ల‌భించింద‌ని టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రాబోయే రోజుల్లో ఎస్వీబీసీ ద్వారా మ‌రింత జ‌న‌రంజ‌క కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు. ఎస్వీబీసీ 15వ వార్షికోత్స‌వం శుక్ర‌వారం తిరుప‌తి లోని ఛాన‌ల్ కార్యాల‌యంలో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి టీటీడీ చైర్మ‌న్ ముఖ్య అతిథిగా హాజ‌రై ప్ర‌సంగించారు.

క‌రోనా క‌ష్ట కాలంలో బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు నానా తంటాలు ప‌డుతున్న స‌మ‌యంలో, భ‌య ప‌డుతున్న క్ర‌మంలో (TTD) ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డి ఆధ్వ‌ర్యంలో భ‌క్తుల‌ను ఆక‌ట్టుకునేలా కార్య‌క్ర‌మాల‌ను రూపొందించేలా చేశార‌ని ప్ర‌శంసించారు. దీని వల్ల ప్ర‌పంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున భ‌క్తుల నుంచి ఆద‌ర‌ణ ల‌భించింద‌ని స్ప‌ష్టం చేశారు. సుంద‌ర‌కాండ‌, భ‌గ‌వ‌ద్గీత లాంటి ఇతిహాసాలు , ఇత‌ర ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాలు విశేషంగా ఆక‌ట్టుకున్నాయ‌ని తెలిపారు చైర్మ‌న్.

వీటి ప్ర‌సారం వ‌ల్ల కోట్లాది మంది వీక్ష‌కులు పెరిగార‌ని చెప్పారు. ఎస్వీబీసీ యూట్యూబ్ , ఆన్ లైన్ రేడియోకు కూడా భ‌క్తుల నుంచి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంద‌న్నారు . హిందీ, త‌మిళం, క‌న్న‌డ భాష‌ల‌కు సంబంధించి ఆయా కేంద్రాల్లో స్టూడియోలు నిర్మాస్తామ‌న్నారు. స్థానిక ప‌రిస్థితుల‌కు అనుగుణంగా కార్య‌క్ర‌మాలు రూపొందించాల‌ని సూచించారు.

ఈవో , ఎస్వీబీసీ ఎండీ ఏవీ ధ‌ర్మా రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల స‌మిష్టి కృషితో ఛాన‌ల్ ఈ స్థాయికి చేరింద‌న్నారు. ప్ర‌వ‌చ‌న క‌ర్త‌లు, మేధావుల‌ను అనుసంధానం చేసి కార్య‌క్ర‌మాల‌ను రూపొందించామ‌న్నారు. ఛాన‌ల్ సిఇవో ష‌ణ్ముఖ్ కుమార్ వార్షిక నివేదిక‌ను వినిపించారు.

Also Read : Karnataka High Court : పిల్ల‌లు ప్ర‌భుత్వాల‌ను విమ‌ర్శిస్తే ఎలా

Leave A Reply

Your Email Id will not be published!