Chattisgarh Lok Poll Survey : ఛత్తీస్‌గఢ్ లో మళ్లీ హస్తం హవా
లోక్ పోల్ సర్వేలో కాంగ్రెస్ కే ఛాన్స్
Chattisgarh Lok Poll Survey : దేశంలో త్వరలో 5 రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో ఇప్పటికే చాప కింద నీరులా గ్రౌండ్ వర్క్ చేస్తోంది కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ. ఈసారి ఎలాగైనా ఆయా రాష్ట్రాలలో పాగా వేయాలని ఫిక్స్ అయ్యింది. ఆ మేరకు పావులు కదుపుతోంది. ప్రధానంగా దేశం మొత్తం కాషాయ జెండా మాత్రమే ఉండాలని ఇతర పార్టీలు ఉండ కూడదని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఆ మేరకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించు కుంటోంది.
దక్షిణాదిన తెలంగాణ, ఏపీలో , ఛత్తీస్ గఢ్ , రాజస్థాన్ లలో ఫుల్ ఫోకస్ పెట్టింది. ఏపీలో వైసీపీ , తెలంగాణలో భారత రాష్ట్ర సమితి, రాజస్థాన్ , ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వాలు కొలువు తీరాయి. తాజాగా లోక్ పోల్(Lok Poll) సర్వే భూపేష్ బఘేల్ సారథ్యంలోని ఛత్తీస్ గఢ్ లో సర్వే చేపట్టింది.
జూన్ 1 నుండి జూలై 5 మధ్య సర్వే చేపట్టింది రాష్ట్రంలో . మొత్తం 90 అసెంబ్లీ సీట్లకు గాను భారతీయ జనతా పార్టీకి 25 నుంచి 29 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇక అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 56 నుంచి 60 సీట్లు వస్తాయని , బహుజన్ సమాజ్ పార్టీకి 1 నుంచి 2 సీట్లు వస్తాయని, జేసీసీ(సీ ) పార్టీకి 2 సీట్లు , ఇతరులకు ఒక సీటు దక్కే అవకాశం ఉందని లోక్ పాల్ సర్వే సంస్థ వెల్లడించింది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి ఇది బూస్ట్ అని చెప్పక తప్పదు.
Also Read : Tirumala Rush : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.69 కోట్లు
