kuchukulla Damodar Reddy : గులాబీకి కూచుకుళ్ల గుడ్ బై

కొల్లాపూర్ లో ప్రియాంక స‌భ‌లో

kuchukulla Damodar Reddy : తెలంగాణ‌లో రాజ‌కీయాలు శ‌ర‌వేగంగా మారుతున్నాయి. ఆయా పార్టీల‌కు చెందిన నేత‌లు ప‌క్క చూపులు చూస్తున్నారు. గోడ దూకేందుకు సై అంటున్నారు. ఇప్ప‌టికే ప‌క్క పార్టీలో త‌మ‌కు టికెట్ పొందేలా పావులు క‌దుపుతున్నారు. గ‌త కొంత కాలం నుంచీ ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాకు చెందిన భార‌త రాష్ట్ర స‌మితి పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోద‌ర్ రెడ్డి స్వంత పార్టీని వీడుతార‌ని ప్ర‌చారం జ‌రిగింది.

దానిని నిజం చేస్తూ ఆయ‌న ఇటీవ‌ల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో సీనియ‌ర్ నాయ‌కుడు మ‌ల్లు ర‌వితో ట‌చ్ లో ఉన్నారు. సోమ‌వారం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు కూచుకుళ్ల దామోద‌ర్ రెడ్డి(Kuchukulla Damodar Reddy). నాగ‌ర్ క‌ర్నూల్ లో జ‌రిగిన కాంగ్రెస్ పార్టీ కార్యాల‌య ప్రారంభోత్స‌వంలో ద‌ర్శ‌నం ఇచ్చారు. అంద‌రినీ విస్తు పోయేలా చేశారు.

తాను బీఆర్ఎస్ కు గుడ్ బై చెపుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు స్వ‌యంగా దామోద‌ర్ రెడ్డి. ఈనెల 20 న కొల్లాపూర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించే స‌భ‌కు హాజ‌ర‌వుతాన‌ని, అక్క‌డ ఏఐసీసీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ స‌మ‌క్షంలో చేర‌నున్న‌ట్లు వెల్ల‌డించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ. ఒక ర‌కంగా సీఎం కేసీఆర్ కు ఇది కోలుకోలేని దెబ్బేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. గ‌తంలో కూచుకుళ్ల దామోద‌ర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ గా కూడా ప‌ని చేశారు.

Also Read : MLA Rajaiah Kadiyam : క‌డియం అవినీతి తిమింగ‌లం

Leave A Reply

Your Email Id will not be published!