CM YS Jagan : సంక్షేమం లక్ష్యం అభివృద్ది నినాదం – జగన్
ఏపీ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం - సీఎం
CM YS Jagan : సంక్షేమమే లక్ష్యమని , అభివృద్ది తమ నినాదమని స్పష్టం చేశారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. సోమవారం వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటించారు. కడపలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. నగరంలో రూ. 5.62 కోట్లతో అభివృద్ది చేసిన రాజీవ్ మార్గ్ ను ప్రారంభించారు సీఎం. అనంతరం కడప నగర పాలక సంస్థ నూతన కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
అంతకు ముందు తాడేపల్లి గూడెం నుంచి బయలుదేరి ఇడుపాల పాయకు చేరుకున్నారు. స్థానిక నేతలతో ఆత్మీయంగా కలుసుకున్నారు. రూ. 12 కోట్లతో ఆధునీకరించిన రాజీవ్ మార్గ్ రోడ్డును ప్రారంభించారు జగన్ మోహన్ రెడ్డి(CM YS Jagan). నగరానికి శాశ్వత తాగునీటి పరిష్కారం దిశగా అమృత్ పథకంతో పాటు మొత్తం రూ. 760 కోట్ల ఖర్చుతో చేపట్టిన అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు ఏపీ సీఎం.
పునః నిర్మించిన రాజీవ్ పార్క్ ను చూసి సంతోషం వ్యక్తం చేశారు జగన్ రెడ్డి. అక్కడి నుంచి హెలిప్యాడ్ ద్వారా కోప్పర్తికి వెళ్లారు. అక్కడ జగనన్న పారిశ్రామిక వాడలో ఏర్పాటు చేసిన అల్ డిక్సన్ సీసీ కెమెరాల తయారీ పరిశ్రమను ప్రారంభించారు జగన్ మోహన్ రెడ్డి. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఏపీ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ది అన్నది నిరంతరం కొనసాగుతుందన్నారు. తాను ఉన్నంత వరకు ప్రజా సంక్షేమం కోసం పాటు పడతానని స్పష్టం చేశారు జగన్ రెడ్డి.
Also Read : Revanth Reddy Seethakka : కాంగ్రెస్ వస్తే సీతక్క సీఎం – రేవంత్
