Gudivada Amarnath : ఉన్మాదిలా మాట్లాడితే ఊరుకోం

మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్

Gudivada Amarnath : ఉన్మాదిలా మాట్లాడుతున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ నోరు జాగ్ర‌త్త పెట్టుకోక‌పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు ఏపీ ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. త‌మ‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై భ‌గ్గుమ‌న్నారు. క‌మెడియ‌న్లు, సైడ్ యాక్ట‌ర్స్ కు ఉన్నంత విలువ కూడా ప‌వ‌న్ కు లేద‌న్నారు.

ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డి పై ప‌దే కామెంట్స్ చేయ‌డం మానుకోవాల‌ని లేక పోతే పుట్ట‌గ‌తులు ఉండ‌వ‌న్నారు. నిత్యం పెళ్లిళ్లు చేసుకునే ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ప్ర‌జ‌ల్లో ఏహ్య భావం ఉంద‌న్నారు. ఎక్క‌డ ఎవ‌రిపై మ‌న‌సు పారేసుకుంటాడో, ఎవ‌రికి తాళి క‌డ‌తాడో తెలియ‌క మ‌హిళ‌లు, అమ్మాయిలు భ‌య‌ప‌డుతున్నారంటూ ఎద్దేవా చేశారు గుడివాడ అమ‌ర్నాథ్(Gudivada Amarnath).

గ్రామాల్లో నిబ‌ద్ద‌త‌తో ప‌ని చేస్తున్న వాలంట‌ర్ల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం దారుణ‌మ‌న్నారు. ఎలాంటి ప్రాథ‌మిక స‌మాచారం లేకుండా ఆరోప‌ణ‌లు చేస్తే ఎలా అని ప్ర‌శ్నించారు. ఇంకోసారి నోరు జారితే ప్ర‌జ‌లే చెప్పులు చూపిస్తార‌ని హెచ్చరించారు ఏపీ ఐటీ మంత్రి. చంద్ర‌బాబు ఇచ్చే ప్యాకేజీ కోసం వారాహి యాత్ర చేప‌డుతున్న నీకు క‌నీస విలువ‌లు లేవంటూ మండిప‌డ్డారు.

నీ మూడో భార్య గురించి రాసింతి టీడీపీ ప‌చ్చ ప‌త్రిక‌లో అన్న సంగ‌తి మ‌రిచి పోతే ఎలా అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ప్ర‌శ్నించారు గుడివాడ అమ‌ర్నాథ్. ప‌వ‌ర్ లోకి వ‌స్తే ఏం చేస్తావో చెప్ప‌కుండా ఇలాగేనా మాట్లాడేది అంటూ ప్ర‌శ్నించారు.

Also Read : CM YS Jagan : సంక్షేమం ల‌క్ష్యం అభివృద్ది నినాదం – జ‌గ‌న్

Leave A Reply

Your Email Id will not be published!