Arvind Kejriwal : ఢిల్లీలో రెడ్ అలర్ట్ – కేజ్రీవాల్
హస్తినతో పాటు ఉత్తర భారతంలో వర్షాలు
Arvind Kejriwal : యమునా నది ఉప్పొంగుతోంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తర భారతం ఉప్పెనలాగా మారింది. ఎక్కడ చూసినా వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షాల ధాటికి 20 మందికి పైగా చని పోయినట్లు సమాచారం. రాజస్థాన్, మధ్య ప్రదేశ్ , హిమాచల్ ప్రదేశ్ , ఢిల్లీ , తదితర ప్రాంతాలు వర్షాలతో నిండి పోయాయి. కొన్ని రోజుల నుంచి ఎడ తెరిపి లేకుండా కురుస్తుండడంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది.
ఈ మేరకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) సారథ్యంలో ఢిల్లీ సచివాలయంలో కీలక సమావేశం చేపట్టారు. ఈ సందర్భంగా వరద ముంచెత్తడం, వర్షాలు కురుస్తుండడంతో ఢిల్లీలో రోడ్లన్నీ నీట మునిగాయి. చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇప్పటికే ఢిల్లీ నగర పాలక సంస్థ అప్రమత్తమైంది. 40 ఏళ్లలో తొలిసారిగా భారీ ఎత్తున వర్షం కురిసిందని ఈ సందర్భంగా తెలిపారు అరవింద్ కేజ్రీవాల్.
ఢిల్లీ మంత్రివర్గం భేటీ అనంతరం సీఎం సోమవారం మీడియాతో మాట్లాడారు. వరద ఉధృతి కొనసాగుతోందని , దీంతో రెడ్ అలర్ట్ ప్రకటించామని చెప్పారు. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నగర పాలక సిబ్బంది కలిసి వరద ప్రాంతాలను సందర్శించారని చెప్పారు. యమునా నదికి ఆనుకుని ఉన్న పేదలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించామని వెల్లడించారు సీఎం.
అవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ సూచించారు ఢిల్లీ సీఎం. భారీ వర్షాల కారణంగా ప్రభుత్వ పరంగా నడుస్తున్న విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించినట్లు చెప్పారు.
Also Read : Gudivada Amarnath : ఉన్మాదిలా మాట్లాడితే ఊరుకోం
