MLC Kavitha : కొముమరమ్మ ఎట్టున్నవ్ – కవిత
రోడ్డు పక్కన కంకులు కొన్న ఎమ్మెల్సీ
MLC Kavitha : జగిత్యాల జిల్లాలో అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ మధ్య బిజీగా మారారు. జిల్లా టూర్ లో భాగంగా పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం తిరుగు ప్రయాణం అయ్యారు హైదరాబాద్ కు. మార్గ మధ్యంలో మల్యాల మండలం మీదుగా ప్రయాణం చేస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల ఉన్నట్టుండి తన వాహనాన్ని నిలిపారు. కారు దిగిన వెంటనే రోడ్డు పక్కనే చెట్టు కింద వరి కంకులను అమ్ముతున్న కొమురమ్మ వద్దకు వెళ్లారు. ఆమెను ఆప్యాయంగా పలకరించారు కవిత. తను కూడా కంకులు ఆమె వద్ద నుంచి కొనుగోలు చేశారు.
ఈ సందర్భంగా కొద్ది సేపు కొమురమ్మతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న భారత రాష్ట్ర సమితి పాలన ఎలా ఉందంటూ ప్రశ్నించారు. నీకు సీఎం కేసీఆర్ తెలుసా. నన్ను గుర్తు పట్టినవా అంటూ అడిగారు కవిత(Kavitha). ఈ సందర్భంగా ఆసక్తికర సమాధానం ఇచ్చింది కంకులు అమ్ముతున్న కొమురమ్మ. సీఎం కేసీఆర్ మా పేదోళ్లకు దేవుడని, ఆయన లేకపోతే తనకు పెన్షన్ వచ్చేది కాదని పేర్కొంది.
అంతే సీఎం మా లాంటి వారికి ఎంతో సాయం చేశాడని , ఇంకా చేస్తూనే ఉన్నాడని, చల్లంగ బతకాలని కోరింది. గతంలో పాలన కంటే ప్రస్తుతం సీఎం పాలన అద్బుతంగా ఉందంటూ కితాబు ఇచ్చింది. దీంతో కొమురమ్మ ఇచ్చిన సమాధానంతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంతోషానికి లోనైంది. మళ్లొస్త కొమురమ్మా నిను కలుస్తానంటూ అక్కడి నుంచి బయలుదేరారు.
Also Read : Revanth Reddy : రైతులకు 3 గంటలు కరెంట్ చాలు – రేవంత్
