CM YS Jagan : ఆర్టీసీ బస్సు ప్రమాదం బాధాకరం – సీఎం
సంతాపం తెలిపిన జగన్ మోహన్ రెడ్డి
CM YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా దర్శికి సమీపంలో ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ)కు చెందిన బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తెలిసిన వెంటనే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(CM YS Jagan) వెంటనే స్పందించారు. బస్సు ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని స్పష్టం చేశారు సీఎం.
బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. ఇదిలా ఉండగా పొదిలి నుంచి కాకినాడకు పెళ్లి బృందంతో వెళుతున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించ బోయింది. దీంతో పక్కనే ఉన్న ఎన్సీపీ కాల్వలో పడి పోయిందని అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన స్థలానికి వెంటనే అంబులెన్సులు, పోలీసులు చేరుకున్నారు.
సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు సీఎం జగన్ రెడ్డికి తెలియ చేశారు. మృతుల కుటుంబాలకు తోడుగా నిలవాలని ఆదేశించారు. మరో వైపు విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ సైతం సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
Also Read : SS Thaman Pawan Kalyan : పవన్ కళ్యాణ్ సంగీత ప్రియుడు
