DK Shiva Kumar : విప‌క్షాల భేటీకి సోనియా హాజ‌రు – డీకే

వెల్ల‌డించిన డిప్యూటీ సీఎం శివ‌కుమార్

DK Shiva Kumar : బీజేపీకి వ్య‌తిర‌కంగా ప్ర‌తిప‌క్షాల కూటమి (పీడీఎఫ్‌) కీల‌క స‌మావేశం క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులో జూలై 17, 18న రెండు రోజుల పాటు జ‌ర‌గ‌నుంది. తొలి స‌మావేశం బీహార్ లోని పాట్నాలో జ‌రిగింది. అనంత‌రం సిమ్లాలో చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించారు. కానీ భారీ వ‌ర‌ద‌ల కార‌ణంగా మీటింగ్ ను బెంగ‌ళూరుకు మార్చారు. ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు క‌ర్ణాట‌క పీసీసీ చీఫ్ , డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్(DK Shiva Kumar). మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. విప‌క్షాల కీల‌క భేటీకి సీపీపీ చైర్ ప‌ర్స‌న్ , ఏఐసీసీ మాజీ చీఫ్ సోనియా గాంధీ హాజ‌రు కానున్నార‌ని చెప్పారు.

ఆమెతో పాటు ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, ఆప్ క‌న్వీన‌ర్ , ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ , ఆర్జేడీ నేత‌, డిప్యూటీ సీఎం తేజ‌స్వి యాద‌వ్ , బీహార్ సీఎం నితీశ్ కుమార్ , టీఎంసీ చీఫ్ , సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ, శివ‌సేన పార్టీ చీఫ్ , మాజీ సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే , అధికార ప్ర‌తినిధి సంజ‌య్ రౌత్ , జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ , డీఎంకే చీఫ్ ,త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ తో పాటు ఆర్ఎల్డీ నేత కూడా హాజ‌రు కానున్నార‌ని వెల్ల‌డించారు డీకే శివ‌కుమార్.

ఈ దేశంలో మార్పు కోసం ఈ గొప్ప ఉద్య‌మంలో చేరాల‌ని అనుకునే నాయ‌కులంద‌రికీ హాజ‌రు కావాల్సిందిగా కోరుతున్నామ‌ని స్ప‌ష్టం చేశారు . జూలై 12న రాహుల్ గాంధీపై వేటు వేయ‌డాన్ని నిర‌సిస్తూ క‌ర్ణాట‌క రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలిపారు.

Also Read : CM YS Jagan : ఆర్టీసీ బ‌స్సు ప్ర‌మాదం బాధాక‌రం – సీఎం

 

Leave A Reply

Your Email Id will not be published!