Revanth Reddy : కేసీఆర్ కు నేనంటే భ‌యం – రేవంత్

నా క‌ళ్ల‌ల్లోకి చూసి మాట్లాడే ద‌మ్ముందా

Revanth Reddy : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్ పై భ‌గ్గుమ‌న్నారు. త‌న క‌ళ్ల‌ల్లోకి చూసి మాట్లాడేంత ధైర్యం ఆయ‌న‌కు లేద‌న్నారు. రేవంత్ రెడ్డి(Revanth Reddy) మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కు త‌న పేరు తీయాలంటే వ‌ణుకు ప‌డుతుంద‌న్నారు. క‌ల్ల‌బొల్లి క‌బుర్లు చెప్ప‌డం సీఎంకు అల‌వాటుగా మారింద‌ని ధ్వ‌జ‌మెత్తారు టీపీసీసీ చీఫ్‌.

ప్ర‌జ‌ల్ని మోసం చేస్తున్న సీఎంకు , బీఆర్ఎస్ పార్టీకి జ‌నం క‌చ్చితంగా కోలుకోలేని రీతిలో షాక్ ఇవ్వ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు. తాను ఉచిత విద్యుత్ గురించి ఏం మాట్లాడానో తెలుసు కోకుండా అవాకులు చెవాకులు పేలితే ఎలా అని ప్ర‌శ్నించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

బాధ్య‌తాయుత‌మైన ప‌ద‌వుల్లో ఉన్న వాళ్లు ప్ర‌తిప‌క్షాల‌పై ఎలా వ్య‌క్తిగ‌తంగా విమ‌ర్శ‌లు చేస్తారంటూ ప్ర‌శ్నించారు. మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, శాస‌న స‌భ స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి త‌న్నీరు హ‌రీష్ రావుల‌పై నిప్పులు చెరిగారు.

సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కే వీళ్ల‌కు ప‌ద‌వులు త‌ప్ప ఇంకేం గుర్తుకు రావ‌డం లేద‌న్నారు. స్పీక‌ర్, చైర్మ‌న్ ల పుత్ర‌ర‌త్నాలు అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నారంటూ ఆరోపించారు. రాబోయే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పవ‌ర్ లోకి రావ‌డం ఖాయ‌మ‌ని ధీమా వ్య‌క్తం చేశారు రేవంత్ రెడ్డి.

Also Read : K Rama Krishna : ఏపీలో గాడి త‌ప్పిన విద్యా వ్య‌వ‌స్థ

Leave A Reply

Your Email Id will not be published!