KC Venu Gopal : విపక్షాల భేటీ గేమ్ ఛేంజర్ – వేణుగోపాల్
బీజేపీకి వ్యతిరేకంగా బలమైన గొంతుక
KC Venu Gopal : కేంద్రంలో కొలువు తీరిన మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ రాచరిక పాలన సాగిస్తోందంటూ మండిపడ్డారు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్(KC Venu Gopal). సోమవారం బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీకి వ్యతిరేకంగా ఒక బలమైన గొంతుకగా మారేందుకు తాము ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.
ఇప్పటి వరకు ప్రతిపక్షాలన్నీ కలిసి పాట్నాలో తొలిసారి సమావేశం కావడం జరిగిందన్నారు. ఇవాళ, రేపు అంటే జూలై 17, 18 రెండు రోజుల పాటు కీలక భేటీ కొనసాగుతోందని తెలిపారు. ఈ భేటీ అన్నది దేశ రాజకీయాలలో గేమ్ ఛేంజర్ కాబోతోందని పేర్కొన్నారు కేసీ వేణుగోపాల్.
ప్రస్తుతం ఇది రెండోసారి సమావేశం కావడం , ఇందులో సీట్ల షేరింగ్ తో పాటు ఇతర ప్రధాన అంశాలపై అన్ని పార్టీలు చర్చించడం జరుగుతుందని తెలిపారు. తామంతా ఉమ్మడి ప్రయోజనంతో ఐక్యంగా ఉన్నామని తెలిపారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం , రాజ్యాంగ హక్కులు, మన సంస్థల స్వతంత్రతను నిర్ధారించడం పైనే ఎక్కువగా ఫోకస్ పెడతామన్నారు.
ప్రతిపక్షాల గొంతు నొక్కాలని బీజేపీ ప్రయత్నం చేస్తోందంటూ కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. విచిత్రం ఏమిటంటే కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసి గొల్పుతున్నారంటూ ధ్వజమెత్తారు. ఈ మీటింగ్ ఓ మైలు రాయిగా మిగిలి పోతుందన్నారు.
Also Read : Opposition Parties Meeting : విపక్షాల కూటమి కీలక సమావేశం
