PM Modi : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన విపక్షాలపై మండిపడ్డారు. ఆయా పార్టీలన్నీ కుటుంబ పార్టీలంటూ ధ్వజమెత్తారు. వాళ్లకు కుటుంబం తప్ప ఈ దేశం గురించి, ప్రజల గురించి పట్టదంటూ మండిపడ్డారు ప్రధానమంత్రి.
అందుకే గతంలో 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చెంప ఛెళ్లుమనిపించేలా విపక్షాలను ప్రజలు పక్కన పెట్టారంటూ గుర్తు చేశారు. త్వరలో 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కూడా విపక్షాలు ఓడి పోవడం ఖాయమన్నారు. వాళ్ల మధ్యనే ఐక్యత లేదని, ఇక ఐక్య ఫ్రంట్ ఎలా కుదురుతుందంటూ ప్రశ్నించారు నరేంద్ర మోదీ.
PM Modi Comments
మంగళవారం పోర్ట్ బ్లెయిర్ లోని వీర్ సావర్కర్ ఎయిర్ పోర్ట్ టెర్మినల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి(PM Modi) మాట్లాడారు. ప్రతి చోటా కొలువు తీరిన పార్టీలన్నీ కుటుంబ పాలనను కొనసాగిస్తున్నాయంటూ ధ్వజమెత్తారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్ , కొడుకు మంత్రి, కూతురు ఎమ్మెల్సీ, అల్లుడు మంత్రి..ఇక తమిళనాడులో తండ్రి సీఎం స్టాలిన్, కొడుకు ఉదయనిధి మంత్రి..కాంగ్రెస్ లో పేరుకే ఏఐసీసీ చీఫ్ ఖర్గే అని కానీ మొత్తం పవర్ అంతా సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ చేతుల్లో ఉందంటూ నిప్పులు చెరిగారు నరేంద్ర మోదీ.
Also Read : Opposition Meet : ఐక్య ఫ్రంట్ పై మల్లగుల్లాలు
