Infosys Donated : శ్రీవారికి ఇన్ఫోసిస్ సుధా..మూర్తి విరాళం 2 కిలోలకు
బంగారు శంఖం..తాబేలు విగ్రహం బహూకరణ
Infosys Donated : ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణ మూర్తి , ఆయన సతీమణి సుధా మూర్తి తిరుమల తిరుపతి దేవస్థానంకు బంగారంతో తయారు చేసిన శంఖం, తాబేలు విగ్రహాన్ని విరాళంగా ఇచ్చారు. దాతృత్వంలో అందరికంటే ముందంజలో ఉన్నారు సుధా, మూర్తి. తిరుమల లోని రంగ నాయకుల మండలంలో టీటీడీ కార్యనిర్వహణ అధికారి ఏవీ ధర్మారెడ్డికి విరాళంగా ఇచ్చారు.
ఇదిలా ఉండగా సుధా మూర్తి గతంలో టీటీడీ పాలక మండలి సభ్యురాలిగా కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా స్వామి వారికి అందజేసిన శంఖం, తాబేలు విగ్రహాలకు సంబంధించి దాదాపు 2 కిలోలకు పైగా బంగారం ఉంటుందని అంచనా. ఆలయంలో కొలువు తీరిన విగ్రహాలను శుభ్రం చేసేందుకు వీటిని ఉపయోగించనున్నట్లు సమాచారం.
Infosys Donated Gold
విరాళం అందించిన విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎస్. రాజీవ్ కృష్ణ(S. Rajiv Krishna) చిత్రాలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. లక్షలాది మందికి సహాయం చేస్తూ వచ్చారు సుధా, మూర్తి. వారు ఎల్లకాలం బాగుండాలని కోరుతూ ట్విట్టర్ లో నెటిజన్లు పేర్కొన్నారు.
కాగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్ట్ ను ఏర్పాటు చేసింది. ఎవరైనా భక్తుడు రూ. 10 వేలు ఇస్తే నేరుగా స్వామి వారి దర్శనం కల్పిస్తారు. ఇప్పటి వరకు భక్తుల నుండి రూ. 880 కోట్లు వసూలు చేసినట్లు ఇటీవలే టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు.
Also Read : PM Modi : కుటంబం తప్ప దేశం పట్దదు – మోదీ
