Vijaya Sai Reddy : టీడీపీకి అంత సీన్ లేదు

రాద్దాంతం చేయ‌డం త‌ప్ప‌

Vijaya Sai Reddy : వైసీపీ ఎంపీ విజ‌య సాయి రెడ్డి నిప్పులు చెరిగారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న మండిప‌డ్డారు. మ‌రోసారి తెలుగుదేశం పార్టీని ఏకి పారేశారు. ప్ర‌జ‌ల్ని త‌ప్పుదోవ ప‌ట్టించేందుకు ప‌దే ప‌దే ఆరోప‌ణ‌లు చేయ‌డం మానుకోవాల‌ని అన్నారు. జ‌నానికి ఎవ‌రు పాల‌కులో తెలిసి పోయింద‌ని ఇక చంద్ర‌బాబు మాట‌ల్ని విశ్వ‌సించే ప‌రిస్థితి లేద‌న్నారు. రాష్ట్రంలో 175 సీట్లు మొత్తం గంప గుత్త‌గా త‌మ‌కే వ‌స్తాయ‌ని ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేదన్నారు ఎంపీ విజ‌య సాయి రెడ్డి.

Vijaya Sai Reddy Words

వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నాలుగు సంవ‌త్స‌రాల పాల‌న‌లో ఒక్క అవినీతి ఆరోప‌ణ లేద‌ని స్ప‌ష్టం చేశారు. నిదులు ప‌క్క‌దోవ ప‌ట్టిన ఉదంతం లేద‌ని పేర్కొన్నారు ఎంపీ(Vijaya Sai Reddy). రైతులు ఎన్న‌డూ లేనంత ధీమాతో ఉన్నార‌ని తెలిపారు. మ‌హిళ‌లు ,యువ‌త , విద్యార్థులు , వృద్దులు, ఆస‌రా లేని వారంతా జ‌గ‌న్ సీఎం మ‌రోసారి సీఎం కావాల‌ని కోరుకుంటున్నార‌ని ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు.

టీడీపీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు ఎంత గొంతు చించుకున్నా, నారా లోకేష్ బాబు ఎన్ని పాద‌యాత్ర‌లు చేసినా లేదా ప‌వ‌న్ క‌ళ్యాణ్ విజ‌య యాత్ర‌లు చేసినా చివ‌ర‌కు గెలిచేది, గెలిపించేది జ‌గ‌న్ నేన‌ని స్ప‌ష్టం చేశారు ఎంపీ విజ‌య సాయి రెడ్డి.

Also Read : TTD EO : స్విమ్స్ లో అన్ని ర‌కాల క్యాన్స‌ర్ల‌కు చికిత్స

Leave A Reply

Your Email Id will not be published!