Arvind Kejriwal : మోదీ వ‌చ్చాక ఆస్తుల అమ్మ‌కం – సీఎం

నిప్పులు చెరిగిన అర‌వింద్ కేజ్రీవాల్

Arvind Kejriwal : ప్ర‌ధాన మంత్రిగా న‌రేంద్ర మోదీ కొలువు తీరాక దేశానికి చేసింది ఏమీ లేదు. గ‌త 9 సంవ‌త్స‌రాల‌లో ఆయ‌న ట్రాక్ రికార్డు ఏమైనా ఉందంటే అది విదేశాల‌లో ప‌ర్య‌టించ‌డం, వ్య‌క్తిగ‌త ప్ర‌చారం చేసుకోవ‌డం, ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌ను తాక‌ట్టు పెట్ట‌డం లేదా గంప గుత్త‌గా అమ్మేయ‌డం త‌ప్ప చేసింది ఏమీ లేద‌న్నారు ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్.

Arvind Kejriwal Opposition Meet

విప‌క్షాల కూట‌మిలో పాల్గొన్న సీఎం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇవాళ త‌ను మాత్రమే ఉండాల‌ని అనుకుంటున్నాడ‌ని, ఇక ఇత‌ర నేత‌లు ఎవ‌రూ ఉండ‌డానికి వీలు లేద‌నే రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు అర‌వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal). గ‌త కొంత కాలంగా ప్ర‌తిప‌క్షాల‌ను మాత్ర‌మే టార్గెట్ చేస్తూ వ‌స్తున్నాడ‌ని, ఇందుకు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను ఉసిగొల్పుతూ త‌ను పైశాచిక ఆనందం పొందుతున్నాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఇవాళ కేంద్రం ప‌నిగ‌ట్టుకుని త‌మ‌పై క‌క్ష క‌ట్టింద‌న్నారు. ఇవాళ దేశంలో ఎక్క‌డా లేని రీతిలో విద్యా రంగాన్ని, ఆరోగ్య రంగాన్ని బ‌లోపేతం చేసిన ఘ‌న‌త ఢిల్లీ స‌ర్కార్ ద‌న్నారు. కానీ మోదీ దీనిని జీర్ణించు కోలేక పోతున్నాడ‌ని ఆరోపించారు. విప‌క్షాలు ఐక్యంగా పోరాడాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌న్నారు.

Also Read : MP Sanjay Singh : విప‌క్షాలంటే మోదీకి భ‌యం

Leave A Reply

Your Email Id will not be published!