Nara Lokesh : ఏపీలో దాచు కోవడం , దోచుకోవడం తప్ప ఇంకేమీ లేదన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. యువగళం పాదయాత్ర ప్రస్తుతం ఏపీలో కొనసాగుతోంది. ఇప్పటికే ఆయన 2 వేల కిలోమీటర్లను పూర్తి చేశారు. విజయవంతంగా కొనసాగుతోంది. ఇదిలా ఉండగా యాత్ర సందర్బంగా కొండపి నియోజకవర్గంలో పర్యటించారు నారా లోకేష్.
Nara Lokesh Yuva Galam
ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఏపీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. ఆపై సీఎం జగన్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఆయన వల్ల రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదన్నారు. ఇప్పటికే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశాడంటూ ఆరోపించారు నారా లోకేష్(Nara Lokesh). ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, తప్పక టీడీపీ పవర్ లోకి వస్తుందని జోష్యం చెప్పారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తాము పవర్ లోకి వచ్చాక వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
లా అండ్ ఆర్డర్ ఎక్కడుందని ప్రశ్నించారు. ఇవాళ పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. కొండపి నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అభివృద్ది చేసిందన్నారు. కానీ ఇవాళ జగన్ సర్కార్ దోచేస్తోందంటూ ధ్వజమెత్తారు నారా లోకేష్. అరాచక వైకాపా ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న ఎమ్మెల్యే సింహం స్వామిని గెలిపించాలని కోరారు.
Also Read : Arvind Kejriwal : మోదీ వచ్చాక ఆస్తుల అమ్మకం – సీఎం
