RPF Jawan Firing : ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కాల్పుల మోత‌

న‌లుగురు అక్క‌డిక‌క్క‌డే మృతి

RPF Jawan Firing : ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేత‌న్ సింగ్ దారుణానికి ఒడిగ‌ట్టాడు. ముంబై – జైపూర్ ఎక్స్ ప్రెస్ రైలు పాల్ఘ‌ర్ స్టేష‌న్ దాటిన వెంట‌నే ఏసీ కోచ్ లో కాల్పుల‌కు తెగ‌బ‌డ్డాడు. ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు ప్రాణాలు కోల్పోయిన‌ట్లు స‌మాచారం. నిందితుడు కానిస్టేబుల్ చేత‌న్ సింగ్ ను పోలీసులు వెంట‌నే అరెస్ట్ చేశారు. కాల్పుల‌కు గ‌ల కార‌ణాలేమిటో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ కాల్పుల ఘ‌ట‌న ఒక్క‌సారిగా క‌ల‌క‌లం రేపింది. దేశ వ్యాప్తంగా విస్తు పోయేలా చేసింది.

RPF Jawan Firing Issue

చేత‌న్ సింగ్ త‌న సీనియ‌ర్ ను కాల్చాడు. మ‌రో బోగీకి వెళ్లి కాల్పులకు దిగాడు. ఈ కాల్పుల ఘ‌ట‌న సోమ‌వారం ఉద‌యం 5 గంట‌ల ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆర్పీఎఫ్ జ‌వాన్ త‌న ఆటోమెటిక్ గ‌న్ నుండి కాల్పులు జ‌రిపాడు(RPF Jawan Firing). న‌డుస్తున్న ట్రైన్ లో అసిస్టెంట్ స‌బ్ ఇన్స్ పెక్ట‌ర్ తో స‌హా సిబ్బందిని కాల్చాడు చేత‌న్ సింగ్. పారి పోయేందుకు ప్ర‌య‌త్నం చేయ‌గా చాక‌చ‌క్యంతో ప‌ట్టుకున్నారు.

జైపూర్ – ముంబై సెంట్ర‌ల్ సూప‌ర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ (12956) లో క‌ల‌క‌లం రేపింది. చేత‌న్ సింగ్ ఉత్త‌ర ప్ర‌దేశ్ లోని హ‌త్రాస్ కు చెందిన వ్య‌క్తి. టికా రామ్ మీనా రాజ‌స్థాన్ లోని స‌వాయ్ మాధోపూర్ నివాసి. ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ‌కు ఆదేశించింది రైల్వే శాఖ‌.

Also Read : Chatra Sthapana Narayanagiri : ఘ‌నంగా ఛ‌త్ర‌స్థాప‌న ఉత్స‌వం

 

Leave A Reply

Your Email Id will not be published!