BJP Office Attack : నిజామాబాద్ బీజేపీ ఆఫీస్ ముట్ట‌డి

ధ‌ర్మ‌పురి అర్వింద్ కు వ్య‌తిరేకంగా నిర‌స‌న

BJP Office Attack : భార‌తీయ జ‌న‌తా పార్టీకి కొత్త‌గా జి. కిష‌న్ రెడ్డి అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించినా ప‌రిస్థితిలో ఎలాంటి మార్పు క‌నిపించ‌డం లేదు. నిజామాబాద్ జిల్లాలో ఎనిమిది మండ‌లాల అధ్య‌క్షుల‌ను మార్చ‌డంపై లొల్లి కొన‌సాగుతోంది. ఇటీవ‌లే రాష్ట్ర పార్టీ కార్యాల‌యంలో నానా ర‌భ‌స చేశారు. ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్ కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. ఆయ‌న వ‌ల్ల‌నే పార్టీ భ్ర‌ష్టు ప‌ట్టి పోయింద‌ని ఆరోపించారు. వెంట‌నే అర్వింద్ ను తొల‌గించాల‌ని డిమాండ్ చేశారు. దీనిపై పార్టీ చీఫ్ ఎలాంటి కామెంట్ చేయ‌లేదు. ఆయ‌న ప్ర‌స్తుతం వ‌ర‌ద బాధిత ప్రాంతాల‌లో ప‌ర్య‌టిస్తున్నారు.

BJP Office Attack Issue

త్వ‌ర‌లో రాష్ట్రంలో శాస‌న‌స‌భ ఎన్నిక‌లు రాబోతున్నాయి. ఈ త‌రుణంలో పార్టీలో ఎంపీ ఒంటెద్దు పోక‌డ పోతున్నాడ‌ని, త‌మ‌కు తెలియ‌కుండా ఎలా నిర్ణ‌యాలు తీసుకుంటారంటూ మండిప‌డ్డారు. తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. రాష్ట్ర పార్టీ ఆఫీసులో సీనియ‌ర్ నాయ‌కులు స‌ర్ది చెప్పే ప్ర‌య‌త్నం చేసినా వాళ్లు ప‌ట్టించు కోలేదు. దీనిని ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్(MP Dharmapuri Arvind) లైట్ గా తీసుకున్నారు.

కొంద‌రు గిట్ట‌ని వాళ్లు చేస్తున్న కుట్ర త‌ప్ప ఏమీ కాద‌న్నారు. ప్ర‌స్తుతం నిజామాబాద్ జిల్లాలో అంతా స‌వ్యంగానే ఉంద‌ని, బీజేపీకి ఢోకా లేద‌న్నారు. ఇప్పుడు ఎన్నిక‌లు చేప‌ట్టినా గెలిచేది తానేన‌ని స్ప‌ష్టం చేశారు. సోమ‌వారం బీజేపీ నాయ‌కులు ఆందోళ‌న బాట ప‌ట్టారు. నిజామాబాద్ లోని పార్టీ ఆఫీసును ముట్ట‌డించే ప్ర‌య‌త్నం చేశారు.

Also Read : Chatra Sthapana Narayanagiri : ఘ‌నంగా ఛ‌త్ర‌స్థాప‌న ఉత్స‌వం

 

Leave A Reply

Your Email Id will not be published!