AP CM YS Jagan : ఏపీ సీఎం జ‌గ‌న్ వైజాగ్ టూర్

ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు

AP CM YS Jagan : ఆంధ్ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి(AP CM YS Jagan) ఫుల్ బిజీగా మారారు. ఆగ‌స్టు 1న మంగ‌ళ‌వారం ఆయ‌న విశాఖ‌ప‌ట్ట‌ణంలో ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ అభివృద్ది ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు చేప‌ట్ట‌నున్నారు.

వైజాగ్ టూర్ లో భాగంగా ఉద‌యం 9.30 గంట‌ల‌కు తాడేప‌ల్లి గూడెంలోని త‌న నివాసం నుంచి బ‌య‌లుదేరుతారు. అక్క‌డి నుంచి నేరుగా విశాఖ‌కు చేరుకుంటారు. ముందుగా కైలాస‌పురం పోర్టు ఆస్ప‌త్రి స‌మీపంలో ఇనార్బిట్ మాల్ నిర్మాణానికి భూమి పూజ చేస్తారు సీఎం జ‌గ‌న్ రెడ్డి.

AP CM YS Jagan Tour

అనంత‌రం హై టీలో పాల్గొంటారు. అదే ప్రాంగణంలో జీవీఎంసీకి చెందిన 50 అభివృద్ది ప‌నుల‌కు శంకుస్థాప‌న చేస్తారు. అక్క‌డి నుంచి సిరిపురంకు చేరుకుంటారు. ఏయూ క్యాంప‌స్ కు చేరుకుంటారు. ఎలిమెంట్ ఫార్మా ఇంక్యుబేష‌న్ సెంట‌ర్ , బ‌యో మానిట‌రింగ్ హ‌బ్ తో స‌హా ఐదు ప్రాజెక్టులకు సంబంధించిన భ‌వ‌నాల‌ను సీఎం లాంఛ‌నంగా ప్రారంభిస్తారు.

ఆ త‌ర్వాత బీచ్ రోడ్డు లోని ఏయూ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ కు చేరుకుంటారు. ఆంధ్రా విశ్వ విద్యాల‌యం విద్యార్థుల‌తో సీఎం మాట్లాడ‌తారు. వారితో ముఖా ముఖి అనంత‌రం తాడేప‌ల్లి గూడెంకు బ‌య‌లు దేరి వెళ‌తారు.

Also Read : BJP Office Attack : నిజామాబాద్ బీజేపీ ఆఫీస్ ముట్ట‌డి

 

Leave A Reply

Your Email Id will not be published!