Rahul Gandhi : మోదీ పరువు నష్టం కేసులో తనకు గుజరాత్ కోర్టు శిక్ష ఖరారు చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై సంచలన తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. శిక్ష వేయడం అటుంచితే స్టే విధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో గత కొంత కాలంగా రాహుల్ గాంధీపై చేస్తున్నదుష్ప్రచారం తప్పని తేలి పోయింది. శుక్రవారం వెలువురించిన కోర్టు తీర్పుపై స్పందించారు. ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ.
Rahul Gandhi Said
తీర్పు ఆలస్యం అయినప్పటికీ అంతిమంగా న్యాయమే గెలుస్తుందన్నారు. తనపై ప్రేమాభిమానులు కురిపించిన వారికి, తనను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని రాహుల్ గాంధీ(Rahul Gandhi) అన్నారు.
తీర్పు వెలువడిన అనంతరం ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. నాకు కోర్టుపై నమ్మకం ఉందన్నారు. అంతిమంగా న్యాయం గెలుస్తుందని తనకు తెలుసు అన్నారు. అదే ఇవాళ రూఢీ అయ్యిందన్నారు రాహుల్ గాంధీ. ఎక్కువ కాలం అబద్దాలతో, ద్వేషాలతో, కులం, మతం పేరుతో రాజకీయాలు చేయలేరన్నారు.
అయితే తాను ఏం చేయాలనే దానిపై తనకు పూర్తి క్లారిటీ ఉందన్నారు రాహుల్ గాంధీ. అబద్దాలతో , అసత్యాలతో , ఆచరణకు నోచుకోని హామీలతో ఎంత కాలం ప్రజలను మోసం చేయలేరన్నారు.
Also Read : Jennifer Larson : తిరుమలలో యుఎస్ కాన్సుల్ జనరల్
