Nara Lokesh : జ‌హీరుద్దీన్ మ‌ర‌ణం బాధాక‌రం

టీడీపీ నేత నారా లోకేష్

Nara Lokesh : ప్ర‌ముఖ ఉర్దూ దిన‌ప‌త్రిక సియాస‌త్ మేనేజింగ్ ఎడిట‌ర్ జ‌హీరుద్దీన్ అలీ ఖాన్ ఆక‌స్మిక మ‌ర‌ణం ప‌ట్ల ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌ముఖ గాయ‌కుడు, ప్ర‌జా యుద్ద నౌక గ‌ద్ద‌ర్ అంతిమ యాత్ర‌లో చివ‌రి వ‌ర‌కు పాల్గొన్నారు. కానీ ఉన్న‌ట్టుండి ఊపిరి ఆడ‌క కింద ప‌డి పోయాడు. ప‌క్క‌నే ఉన్న వారంతా ఆయ‌న‌ను బ‌తికించే ప్ర‌య‌త్నం చేశారు. చివ‌ర‌కు హుటా హుటిన ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అప్ప‌టికే జహీరుద్దీన్ అలీ ఖాన్ మ‌ర‌ణించార‌ని తేల్చారు వైద్యులు.

Nara Lokesh Tributes to Zaheer Ali Khan

ఈ సంద‌ర్బంగా తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం తెలిపారు. తెలంగాణ ఉద్య‌మానికి ఆయ‌న సంపూర్ణ స‌హ‌కారం అంద‌జేశార‌ని కొనియాడారు. మంగ‌ళ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా విష‌యం తెలుసుకున్న నారా లోకేష్(Nara Lokesh) సియాస‌త్ ఎడిట‌ర్ జ‌హీరుద్దీన్ అలీ ఖాన్ మ‌ర‌ణం ప‌ట్ల తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఆయ‌న సాహ‌సోపేత‌మైన జ‌ర్న‌లిస్టు మాత్ర‌మే కాదు..అంకిత భావంతో కూడిన సామాజిక కార్య‌క‌ర్త అని కొనియాడారు. అధికారంలో ఉన్న వారిని జ‌వాబుదారీగా చేయ‌డంలో ప్ర‌య‌త్నం చేశాడ‌ని పేర్కొన్నారు. ఆయ‌న మృతి ప‌ట్ల ప్ర‌గాఢ సానుభూతిని తెలియ చేస్తున్నాన‌ని, వారి కుటుంబ స‌భ్యుల‌కు ఆ భ‌గ‌వంతుడు శాంతి చేకూర్చాల‌ని కోరుతున్న‌ట్లు తెలిపారు.

Also Read : INDIA Walk Out : రాజ్య‌స‌భ నుండి విప‌క్షాలు వాకౌట్

Leave A Reply

Your Email Id will not be published!