Jayaprakash Narayan : గద్దర్ పై నోరు పారేసుకున్న జేపీ
ఆయనకు అధికారిక లాంఛనాలా
Jayaprakash Narayan : మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ నోరు పారేసుకున్నారు. ఆయన తెలంగాణ పట్ల మొదటి నుంచి తన అక్కసు వెళ్లగక్కుతూనే వచ్చారు. ఇటీవలే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కూడా కామెంట్ చేశారు. తాజాగా తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన ప్రజా యుద్ద నౌక గద్దర్ గురించి కీలక వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఓ ఛానల్ తో మాట్లాడారు జయప్రకాష్ నారాయణ్(Jayaprakash Narayan) . వృత్తి ధర్మం కోసం ఆనాడు పని చేసిన పలువురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.
Jayaprakash Narayan Comments About Gaddar
గద్దర్ నక్సల్ ఉద్యమంలో పని చేశారు. తుపాకీ గొట్టం ద్వారా రాజ్యం వస్తుందని నమ్మారు. తర్వాత పలు ప్రజా పోరాటాలకు ఊపిరి పోశారు తన ఆట పాటలతో . ప్రత్యేకించి మలి దశ ఉద్యమానికి పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా అన్న పాటలు కోట్లాది మందిని తెలంగాణ ఉద్యమంలో మమేకం అయ్యేలా చేసింది.
ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో గద్దర్ పోషించిన పాత్ర విస్మరించ లేనిది. ఇందుకు సంబంధించి రాష్ట్ర సర్కార్ అధికారిక లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు నిర్వహించింది. దీనిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది. యాంటీ టెర్రరిస్ట్ ఫోరమ్ కూడా అభ్యంతరం తెలిపింది. చివరకు సీఎం కేసీఆర్ సైతం గద్దర్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. పోలీసుల ఆత్మ గౌరవం దెబ్బతిందని జయప్రకాష్ నారాయణ్ వాపోయారు.
Also Read : VC Sajjanar : త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు – సజ్జనార్
