Daggubati Purandeswari : ఏపీలో పంచాయతీ నిధులు పక్కదారి
బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి ఫైర్
Daggubati Purandeswari : కేంద్ర ప్రభుత్వం ఓ వైపు లెక్కకు మించి నిధులను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మంజూరు చేసిందన్నారు ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రత్యేకించి గ్రామ పంచాయతీల నిర్వహణ కోసం కేంద్ర సర్కార్ నిధులను భారీ ఎత్తున మంజూరు చేసిందని, కానీ జగన్ సర్కార్ వాటిని ఇతర పథకాలు, కార్యక్రమాలకు వాడుకుందని ఆరోపించారు. నిధులేమో కేంద్రానివని కానీ ప్రచారం మాత్రం జగన్ దర్జాగా చేసుకుంటున్నాడని ధ్వజమెత్తారు దగ్గుబాటి పురందేశ్వరి.
Daggubati Purandeswari Asking
చివరకు నిధులను దారి మళ్లించడంతో ఇప్పటికే గ్రామాల అభివృద్ది కోసం తమ స్వంత నిధులను ఖర్చు చేసిన ఆయా గ్రామాల సర్పంచులు గత్యంతరం లేక, చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి దాపురించిందన్నారు. దీనికంతటికీ ప్రధాన కారణం సీఎం జగన్ రెడ్డేనని ఆరోపించారు పురందేశ్వరి(Daggubati Purandeswari).
అదే విధంగా ప్రభుత్వ పనులు చేపట్టిన వేలాది మంది కాంట్రాక్టర్లకు కావాలని బిల్లులు చెల్లించడం లేదని మండిపడ్డారు. వారంతా అప్పుల ఊబిలో కూరుకు పోయారని ఆవేదన చెందారు. దేని కోసం ఈ ప్రభుత్వం ఉందో అర్థం కావడం లేదన్నారు పురందేశ్వరి.
సర్పంచ్ లు, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని కోరుతూ ఆగస్టు 10 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ ల ముందు బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టనున్నట్లు చెప్పారు. ప్రజలు సహకరించాలని ఆమె కోరారు.
Also Read : CPI Ramakrishna : జగన్ పాలనలో ప్రాజెక్టులపై వివక్ష
