Nara Lokesh : ఖాకీలను వాడుకుంటున్న సైకోలు

నిప్పులు చెరిగిన నారా లోకేష్

Nara Lokesh : తెలుగుదేశం పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. కేవ‌లం టీడీపీ జెండా ప‌ట్టుకున్నందుకు సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 64 మందిని చంపించాడ‌ని ఆరోపించారు. యువ గ‌ళం పాద‌యాత్ర‌లో భాగంగా ఆయ‌న ప్ర‌జ‌లను ఉద్దేశించి ప్ర‌సంగించారు. గొంతు మీద క‌త్తి పెట్టి జ‌గ‌న్ కి జై కొట్ట‌మంటే గొంతు కోయించాడ‌ని ఆరోపించారు నారా లోకేష్.

Nara Lokesh Slams YS Jagan

వేల మంది కార్య‌క‌ర్త‌ల మీద అక్ర‌మ కేసులు బ‌నాయించాడ‌ని మండిప‌డ్డారు. లాక‌ప్ ల‌లో పెట్టి తీవ్రంగా హింసించేలా చేశాడ‌ని అన్నారు. ఇంకా ఈ దౌర్జ‌న్యం భ‌రించాల‌ అని ప్ర‌శ్నించారు నారా లోకేష్(Nara Lokesh). ప్ర‌తి టీడీపీ నేత‌ను, కార్య‌క‌ర్త‌ను కాపాడే బాధ్య‌త‌ను తాను తీసుకున్నాన‌ని అన్నారు. వైసీపీ దుర్మార్గం ప‌రాకాష్ట‌కు చేరుకుంద‌ని, దానిని అంతం చేయ‌డమే ఇక మిగిలి ఉంద‌న్నారు టీడీపీ నేత‌.

వైఎస్సార్ సీపీ పార్టీకి కార్య‌క‌ర్త‌లు లేర‌న్నారు. ఉన్న‌ద‌ల్లా వీధి రౌడీలు మాత్ర‌మే ఉన్నార‌ని మండిప‌డ్డారు. ఆ వీధి రౌడీల కింద పోలీస్ వ్య‌వ‌స్థ‌ను పెట్టాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. వారంతా ఇప్పుడు పోలీసుల‌ను వాడుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.

ప్ర‌స్తుతం రాష్ట్రంలో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌జ‌లు స్ప‌ష్టంగా మార్పు కోరుకుంటున్నార‌ని ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు.

Also Read : Minister KTR : మెట్రో విస్త‌ర‌ణ‌పై కేటీఆర్ ఫోక‌స్ ‍‍‍‍‍‍‍‍‍‍

Leave A Reply

Your Email Id will not be published!