Sonia Gandhi : చ‌దువుకుంటేనే మ‌హిళ‌ల‌కు భ‌విష్య‌త్తు

సీపీపీ చైర్ ప‌ర్స‌న్ సోనియా గాంధీ పిలుపు

Sonia Gandhi : జీవితంలో చ‌దువు ఒక భాగం కావాలి. ప్రత్యేకించి ఈ స‌మాజంలో ఇంకా అస‌మాన‌త‌లు , వివ‌క్షా పూరిత‌మైన వేధింపులు కొన‌సాగుతున్నాయి. వాటి ప‌ట్ల నేను నిరంత‌రం ఆందోళ‌న చెందుతూనే ఉన్నాన‌ని సీపీపీ చైర్ ప‌ర్స‌న్ సోనియా గాంధీ అన్నారు. మ‌హిళ‌లు చ‌దువు కున్న‌ప్పుడే త‌మ‌కు మంచి భ‌విష్య‌త్తును సృష్టించు కోగ‌లుగుతార‌ని స్ప‌ష్టం చేశారు. వారు త‌మ కుటుంబాన్ని, స‌మాజాన్ని ప్ర‌భావితం చేయ‌గ‌ల‌గుతార‌ని పేర్కొన్నారు.

Sonia Gandhi said about Women’s Education

దేశ నిర్మాణంలో మ‌హిళ‌ల భాగ‌స్వామ్యం ఉన్న‌ప్ప‌టికీ అది మ‌రింత పెర‌గాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు సోనియా గాంధీ. ఇవాళ దివంగ‌త దేశ ప్ర‌ధాన మంత్రి రాజీవ్ గాంధీని స్మ‌రించు కుంటున్నామ‌ని చెప్పారు. ఆయ‌న న‌మ్మిన సూత్రాలు, ఆద‌ర్శాల‌పై ప‌ని చేస్తున్న బ‌న‌స్థ‌లి విశ్వ విద్యాల‌యాన్ని గౌర‌వించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

ఢిల్లీలో జ‌రిగిన రాజీవ్ గాంధీ జాతీయ స‌ద్భావ‌న అవార్డు ప్ర‌ధానోత్స‌వ కార్య‌క్ర‌మంలో సోనియా గాంధీ(Sonia Gandhi) ప్ర‌సంగించారు. భార‌త ప్ర‌ధానిగా కేవ‌లం ఐదేళ్ల పాటు ప‌ని చేశారు. ఆయ‌న చైత‌న్య‌వంత‌మైన‌, మ‌నోహ‌ర‌మైన వ్య‌క్తిత్వంతో చెర‌గ‌ని ముద్ర వేశార‌ని పేర్కొన్నారు సోనియా గాంధీ. మ‌న వైవిధ్య‌మే మ‌న బ‌లానికి , మ‌న నాగ‌రిక‌త‌కు మూల‌మ‌ని రాజీవ్ గాంధీ విశ్వ‌సించార‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : Mallikarjun Kharge : రాజీవ్ గాంధీ ఎల్ల‌ప్ప‌టికీ స్పూర్తి – ఖ‌ర్గే

Leave A Reply

Your Email Id will not be published!