Nara Lokesh : ప్రాజెక్టుల పాలిట జగన్ శాపం
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
Nara Lokesh : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు నత్త నడకన సాగుతున్నాయని, దీనికి ప్రధాన కారణం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అని ఆరోపించారు. జగన్ మాటలకు చేతలకు పొంతన ఉండదన్నారు. కానీ చంద్రబాబు నాయుడు హయాంలో ప్రాజెక్టులపై ఎక్కువగా ఫోకస్ పెట్టారని అన్నారు నారా లోకేష్.
Nara Lokesh Comments on CM YS Jagan
ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణ జిల్లా మెట్ట ప్రాంతంలో రైతులకు గోదావరి జలాలు అందించే లక్ష్యంతో చింతలపూడి ఎత్తిపోతల పథకం విస్తరణ పనులను శరవేగంగా పనులు చేపట్టేలా చేశారన్నారు నారా లోకేష్.
దీని ద్వారా రెండు జిల్లాల లోని 33 మండలాల్లో 4.80 లక్షల ఎకరాలకు నీరందించేందుకు గత ప్రభుత్వ హయాంలో రూ. 4,909 కోట్ల అంచనాలతో పనులకు శ్రీకారం చుట్టారని చెప్పారు. అధికారం నుంచి వైదొలిగే నాటికి రూ. 2,289 కోట్లు ఖర్చు చేశామన్నారు నారా లోకేష్.
ప్రాజెక్టు విస్తరణకు భూ సేకరణ సమయంలో నిర్వాసిత రైతులకు కల్లబొల్లి మాటలు చెప్పి జగన్ మోహన్ రెడ్డి రెచ్చ గొట్టాడని ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక పరిహారం ఇవ్వకుండా ముఖం చాటేస్తున్నారంటూ ధ్వజమెత్తారు.
కొత్త ప్రాజెక్టుల మాట దేవుడెరుగు ఉన్న ఎత్తిపోతల పథకాలకు కరెంటు బిల్లులు కట్టలేక వదిలేశారంటూ ధ్వజమెత్తారు.
Also Read : Vijay Sai Reddy : చిన్నమ్మా మామూలుగా లేదమ్మా
