CM KCR Pensioners : కేసీఆర్ కోసం పెన్ష‌న్ డ‌బ్బుల విరాళం

విరాళంగా ఇచ్చిన ముఖ‌రా(కె) గ్రామ‌స్తులు

CM KCR Pensioners : సీఎం కేసీఆర్ కోసం పెన్ష‌న్ దారులు మ‌ద్ద‌తుగా నిలిచిన ఘ‌ట‌న తెలంగాణ‌లో చోటు చేసుకుంది. కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎన్నిక‌ల నామినేష‌న్ కు పెన్ష‌న్ డ‌బ్బుల‌ను విరాళంగా ఇచ్చారు ముఖరా(కే) గ్రామ‌స్తులు. రూ. 1000 చొప్పున 1 ల‌క్ష రూపాయ‌లు సేక‌రించారు.

CM KCR Pensioners Viral

విరాళంగా ఇచ్చిన వారిలో అదే గ్రామానికి చెందిన 100 మంది ఉన్నారు ఫించ‌న్ దారులు. త‌మ‌కు కేసీఆర్(CM KCR) పింఛ‌నే ఆస‌రాగా నిలిచింద‌ని పేర్కొన్నారు. త‌మ పాలిట పెద్ద కొడుకు సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. పండుటాకుల‌మైన త‌మ‌కు పెన్ష‌న్ ఆస‌రాగా నిలుస్తోంద‌ని స్ప‌ష్టం చేశారు.

త‌మ వంతు సాయంగా కేసీఆర్ కు , ఆయ‌న త‌న‌యుడు కేటీఆర్ కు సంబంధించి నామినేష‌న్ కోసం వేయి రూపాయ‌ల చొప్పున విరాళంగా ఇవ్వాల‌ని తీర్మానం చేసుకున్నామ‌ని ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు అంద‌రూ క‌లిసి త‌మ వంతు డ‌బ్బుల‌ను అంద‌జేశారు.

ఇందుకు సంబంధించిన వార్త ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల‌లో వైర‌ల్ గా మారింది. దేశంలోనే ఎక్క‌డా లేని రీతిలో పెన్ష‌న్ , ద‌ళిత బంధు, ఇత‌ర సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్న ఘ‌న‌త కేసీఆర్ ప్ర‌భుత్వానిది. ఆయ‌న తీసుకు వ‌చ్చిన ప‌థ‌కాలు ఆద‌ర్శ ప్రాయంగా మారాయి. ఇదే స‌మ‌యంలో త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గనున్నాయి. దీంతో ప్ర‌చారం మ‌రింత ఊపందుకుంది.

Also Read : Nara Lokesh : ప్రాజెక్టుల పాలిట జ‌గ‌న్ శాపం

Leave A Reply

Your Email Id will not be published!