Chandrababu Naidu : చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్
జైలుకు తరలించాలని ఆదేశించిన జడ్జి
Chandrababu Naidu : దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్ స్కీమ్ కేసులో ఏసీబీ కోర్డు ఆదివారం కీలక తీర్పు వెలువరించింది. తెలుగుదేశం పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును రిమాండ్ కు తరలించాలని ఆదేశించింది. 14 రోజులు జ్యుడీషియల్ విధిస్తూ తీర్పు చెప్పారు న్యాయమూర్తి.
Chandrababu Naidu Got 14 Days Remand
సెప్టెంబర్ 22 వరకు ఆయన జైలులోనే ఉంటారు. విజయవాడలో తీవ్ర ఉద్రికత్త చోటు చేసుకుంది. భారీ భద్రత మధ్య నారా చంద్రబాబు నాయుడును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇదిలా ఉండగా ఏపీ స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) కీలకమైన పాత్ర పోషించారని ఏపీ సీఐడీ రిమాండ్ రిపోర్టు కోర్టుకు సమర్పించింది.
షెల్ కంపెనీల ద్వారా హవాలా రూపంలో కోట్లాది రూపాయలు చేతులు మారాయని ఏపీ ప్రభుత్వం తరపున అడిషనల్ అడ్వొకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి. ఇదిలా ఉండగా చంద్రబాబు నాయుడు తరపున లాయర్లు రెండు పిటిషన్లు దాఖలు చేశారు.
భద్రతా, ఆరోగ్య పరంగా చంద్రబాబు నాయుడి పట్ల ఆలోచించాలని, ఇంటి భోజనం, మందులు ఇచ్చేలా చూడాలని పిటిషన్ దాఖలు చేశారు. అంతే కాకుండా వయసు రీత్యా గృహ నిర్బంధంలో ఉంచాలని జడ్జిని కోరారు. తాజా పిటిషన్స్ పై జడ్జి ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
స్కిల్ స్కీమ్ లో చంద్రబాబుది కీలక పాత్ర ఉందని నమ్ముతూ రిమాండ్ కు తరలించాలని ఆదేశించింది కోర్టు జడ్జి.
Also Read : AP Politics Comment : ఆధిపత్య పోరులో గెలుపెవరిది..?
