ప్ర‌జ‌ల మ‌ధ్య విద్వేషాలు రెచ్చ‌గొట్టింది మీరు కాదా..?

మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై భ‌గ్గుమ‌న్న మంత్రి అన‌గాని

అమ‌రావ‌తి : మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని ఏకి పారేశారు మంత్రి అన‌గాని స‌త్య ప్ర‌సాద్. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ప్ర‌జ‌ల మ‌ధ్య కులాల పేరుతో, మ‌తాల పేరుతో చిచ్చులు పెట్టి రాజ‌కీయంగా ఎదిగింది మీ కుటుంబం కాదా అని ప్ర‌శ్నించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఒక ప్ర‌తిప‌క్ష పార్టీ నాయ‌కుడిగా, మాజీ ముఖ్య‌మంత్రిగా ఆరోగ్య‌క‌ర‌మైన , ప్ర‌జ‌ల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించాల‌ని సూచించారు. కానీ పొద్ద‌స్త‌మానం ప్ర‌జ‌ల‌కు వ్య‌తిరేకంగా చిచ్చు ర‌గిలించేలా రాజ‌కీయాలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేద‌న్నారు అన‌గాని స‌త్య ప్ర‌సాద్. కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టడం ష‌రా మామూలేన‌ని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ సుభిక్షం గా ఉన్నప్పుడు మతాల మధ్య చిచ్చు పెట్టడం వాళ్ళు పూర్వకులు నుంచి ఉందని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆ కల్చర్ తీసుకు వచ్చింది ఆ ఫ్యామిలీ. ఈ రోజు కూడా మనం చుస్తునాం. ఢిల్లీ కి వెళ్లి పార్లమెంట్ సాక్షిగా ప్రెస్ మీట్ పెట్టి 38 డీఎస్పీలు ఉంటే అందులో 35 మంది ఒక సామాజిక వర్గం వారు ఉన్నారంటూ అబ‌ద్ద‌లు చెప్పిన ఘ‌న‌త జ‌గ‌న్ రెడ్డికే ద‌క్కుతుంద‌న్నారు.

ఎందుకంటే అబద్దాల పునాదిలా మీద పుట్టిన పార్టీ . వాళ్ళు చెప్పిన అబద్దాలు 2019 లో ప్రజలు నమ్మారు కాబట్టి ఇక ఎప్పుడు నమ్మరు. ఎందుకంటే జగన్ గాని వాళ్ళ నాయకులు చేసిన పనులు, అరాచకాలు ప్రజలు క‌ళ్లారా చూశార‌ని త‌న‌ను నేల‌కేసి కొట్టార‌ని, 11 సీట్ల‌కే ప‌రిమితం చేశార‌ని ఆ విష‌యం గుర్తు పెట్టుకుంటే మంచిద‌న్నారు. వాళ్లకు ఏ ఇద్దరు సుఖం గా ఉన్నా గొడ్డలి పార్టీకి నచ్చదన్నారు. రాష్ట్రం ప్రగతి వైపు వెళుతుంటే ఇలా ఆధారాలు లేకుండా ఆరోప‌ణ‌లు చేస్తే ఎలా అని ప్ర‌శ్నించారు. దేశంలో రాష్ట్రం నెంబర్ వన్ గా ఉండాలి అని కూటమి ప్రభుత్వం పని చేస్తోంద‌ని చెప్పారు. ఈరోజు కులాల మధ్య చిచ్చు పెట్టి లబ్ది పొందాలని గొడ్డలి పార్టీ చూస్తున్న‌ద‌ని దీనిని తాము అడ్డుకుని తీరుతామ‌న్నారు అన‌గాని స‌త్య ప్ర‌సాద్.

Leave A Reply

Your Email Id will not be published!