G Kishan Reddy : గవర్నర్ నిర్ణయం అభినందనీయం
బీజేపీ చీఫ్ గంగాపురం కిషన్ రెడ్డి
G Kishan Reddy : హైదరాబాద్ – బీఆర్ఎస్ ప్రభుత్వం సిఫారసు చేసిన ఎమ్మెల్సీ పదవులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫైలును తిప్పి పంపిన రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని స్పష్టం చేశారు భారతీయ జనతా పార్టీ చీఫ్ , కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి .
G Kishan Reddy Agreed with Governer Decision
మంగళవారం జి. కిషన్ రెడ్డి(G Kishan Reddy) మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ పదవుల కోసం బీఆర్ఎస్ మండలి సిఫార్సు చేసిన దాసోజు శ్రవణ్ కుమార్ ఆచారి, కుర్రా సత్యనారాయణ పేర్లను గవర్నర్ తిరస్కరించడం అభినందనీయమని పేర్కొన్నారు.
పార్టీ పరంగా తాము ఈ నిర్ణయాన్ని పూర్తిగా సమర్థిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా సామాజికంగా, సాహిత్య పరంగా, వివిధ రంగాలలో నిపుణులైన వారిని, సమర్థులైన వారిని, సామాజికంగా విశిష్టమైన సేవలు అందించిన ప్రముఖులను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
కానీ పార్టీకి ఊడిగం చేసిన వాళ్లను, పార్టీలను మార్చిన వాళ్లను ఎలా ఎమ్మెల్సీ పదవులకు సిఫారసు చేస్తారంటూ ప్రశ్నించారు గంగాపురం కిషన్ రెడ్డి. విజయేంద్ర ప్రసాద్ లాంటి వ్యక్తులకు ఛాన్స్ ఇవ్వాలి కానీ కేసీఆర్ ఫ్యామిలీకి సేవ చేసే వారికి పదవులు ఇస్తున్నాడంటూ ఆరోపించారు.
Also Read : Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు ఊరట
