AP CM YS Jagan : న్యూఢిల్లీ – ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి న్యూఢిల్లీలో బిజీగా ఉన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. అనంతరం కేంద్ర విద్యుత్ శాఖ మంత్రితో కూడా చర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను త్వరితగతిన మంజూరు చేయాలని నిర్మలను కోరారు.
AP CM YS Jagan Delhi Updates
పోలవరం ప్రాజెక్టు , రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్ బకాయిల అంశాలపై కూడా చర్చించారు. పోలవరం పూర్తి కావాలంటే నిధులు త్వరగా రిలీజ్ చేయాలని కోరారు జగన్ రెడ్డి. తాజా అంచనాలకు ఆమోదం తెలపాలని సూచించారు.
2017-18 ధరల సూచీ ప్రకారం పోలవరం ప్రాజెక్టు ఖర్చు 55,548.87 కోట్లు కాగా ఇప్పటికే సాంకేతిక సలహా కమిటీ ఆమోదం తెలిపిందన్నారు ఏపీ సీఎం జగన్ రెడ్డి(AP CM YS Jagan). గతంలో చేసిన విన్నపం మేరకు రూ. 12,911. 15 కోట్లు మంజూరు చేసిందని పేర్కొన్నారు.
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి తొలి దశను పూర్తి చేసేందుకు ఇంకా రూ. 17,144.06 కోట్లు అవసరం అవుతాయని ఆ మేరకు నిధులు రిలీజ్ చేయాలని అభ్యర్థించారు ఏపీ సీఎం. విద్యుత్ బకాయిలు చెల్లించక పోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : Tirumala Hundi : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.13 కోట్లు
