Asaduddin Owaisi : రేవంత్..రాహుల్ పై అస‌దుద్దీన్ ఫైర్

షాకింగ్ కామెంట్స్ చేసిన ఎంఐఎం చీఫ్

Asaduddin Owaisi : హైద‌రాబాద్ – ఎంఐఎం చీఫ్‌, హైద‌రాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. శుక్ర‌వారం హైద‌రాబాద్ లో జ‌రిగిన స‌భ‌లో ఓవైసీ నిప్పులు చెరిగారు. త‌మ కుటుంబం మ‌హారాష్ట్ర నుంచి వ‌చ్చింద‌ని కామెంట్స్ చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు . నా తాత ముత్తాత‌లు హిందూస్తాన్ లో పుట్టార‌ని , నా పూర్వీకులు ఇక్క‌డ జ‌న్మిస్తే ఈ దేశం నాది కాక పోతుందా అని ప్ర‌శ్నించారు అస‌దుద్దీన్ ఓవైసీ.

Asaduddin Owaisi Slams Rahul Gandhi

నువ్వు ఎక్క‌డి నుండి వ‌చ్చావో చెప్పాల‌ని రాహుల్ గాంధీపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు ఎంపీ. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నోటికి వ‌చ్చిన‌ట్లు మాట్లాడుతున్నాడ‌ని, నోరు జాగ్ర‌త్త పెట్టుకోవాల‌ని హెచ్చ‌రించారు. ఆయ‌న మూలాలు ఎక్క‌డివో రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ తెలుస‌న్నారు అస‌దుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi).

ఆర్ఎస్ఎస్ నుండి వ‌చ్చిన రేవంత్ రెడ్డి ఆ వాస‌న‌ను ఇంకా పోగొట్టు కోలేదంటూ ఎద్దేవా చేశారు. ముస్లింలు హిందూస్తాన్ వాళ్లు కాదంటున్నాడు..ఇస్లాం బ‌య‌టి నుండి వ‌చ్చింద‌ని అంటున్నాడ‌ని మండిప‌డ్డారు ఎంపీ.

రేవంత్ రెడ్డి 1999 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కిష‌న్ రెడ్డితో క‌లిసి ప‌ని చేశాడ‌ని, తాను క‌ళ్లారా చూశాన‌ని స్ప‌ష్టం చేశారు. నీ బ‌తుకు చిట్టా అంతా త‌మ వ‌ద్ద ఉంద‌ని హెచ్చ‌రించారు ఓవైసీ. మూడు పార్టీలు మార్చాడ‌ని మండిప‌డ్డారు.

Also Read : AP CM YS Jagan : ఢిల్లీలో సీఎం జ‌గ‌న్ రెడ్డి బిజీ

Leave A Reply

Your Email Id will not be published!