Tirumala Hundi : శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ.3.53 కోట్లు

తిరుమ‌ల‌ను ద‌ర్శించుకున్న భ‌క్తులు 68,828

Tirumala Hundi : తిరుమ‌ల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కింది తిరుమ‌ల పుణ్య క్షేత్రం. రోజూ వారీగా భ‌క్తుల సంఖ్య పెరుగుతోందే త‌ప్పా త‌గ్గ‌డం లేదు. నిన్న శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, శ్రీ అలివేలు మంగ‌మ్మ‌ల‌ను 68 వేల 828 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు.

Tirumala Hundi Collections

శ్రీ‌నివాసుడికి 28 వేల 768 మంది భ‌క్తులు త‌ల‌నీలాలు స‌మ‌ర్పించుకున్నారు. భ‌క్తులు నిత్యం స‌మ‌ర్పించే కానుక‌లు, విరాళాల రూపేణా శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.53 కోట్లు వ‌చ్చింద‌ని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (TTD) వెల్ల‌డించింది.

స్వామి వారి ద‌ర్శ‌నానికి సంబంధించి తిరుమ‌ల లోని 5 కంపార్ట్ మెంట్ల‌లో వేచి ఉన్నారు. ఇక ఎలాంటి టోకెన్లు లేకుండా స‌ర్వ ద‌ర్శ‌నం కోసం వేచి ఉన్న భ‌క్తుల‌కు సంబంధించి శ్రీ‌నివాసుడి ద‌ర్శ‌నానికి క‌నీసం 8 గంట‌ల‌కు పైగా స‌మ‌యం ప‌డుతుంద‌ని టీటీడీ ఈవో ఏవీ ధ‌ర్మా రెడ్డి తెలిపారు.

ఇదిలా ఉండ‌గా శ్రీ‌వారి మెట్లు, అలిపిరి మెట్లు ద్వారా కాలి న‌డ‌క‌న తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించు కునేందుకు వ‌చ్చే భ‌క్తులకు భ‌ద్ర‌తా ప‌రంగా చేతి క‌ర్ర‌లు ఇస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. ఇక సూద‌ర ప్రాంతాల నుంచి వ‌చ్చే భ‌క్త బాంధ‌వుల కోసం వ‌స‌తి సౌక‌ర్యాలు క‌ల్పించిన‌ట్లు పేర్కొన్నారు.

Also Read : Assembly Elections 2023 Comment : మోగిన ఎన్నిక‌ల న‌గారా

Leave A Reply

Your Email Id will not be published!