Nara Lokesh : అమరావతి – తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళవారం ఏపీ సీఐడీ ముందు విచారణకు హాజరు కానున్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయమంలో ఐటీ శాఖ మంత్రిగా పని చేశారు నారా లోకేష్.
చంద్రబాబు హయాంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కిల్ స్కాం కేసుతో పాటు ఫైబర్ నెట్ స్కాం, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్మెంట్ కుంభకోణం కేసులో నారా లోకేష్(Nara Lokesh) , మాజీ మంత్రి కొనకళ్ల నారాయణతో పాటు భార్యను కూడా ఏపీ సీఐడీ చేర్చింది.
Nara Lokesh Attend CID Investigation
ఇప్పటికే ఏపీ సీఐడీ సమన్లు జారీ చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాంకు సంబంధించి ఎ14గా చేర్చింది నారా లోకేష్.హైకోర్టు ఆదేశాల మేరకు కంచనపల్లి లోని సీఐడీ ఆర్థిక నేరాల విభాగం-2 ఆఫీసుకు రానున్నారు నారా లోకేష్. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు విచారణ చేయాలని ఆదేశించింది ఏపీ సీఐడీని.
ఇదే సమయంలో మధ్యలో గంట పాటు లంచ్ బ్రేక్ ఇవ్వాలని స్పష్టం చేసింది. నారా లోకేష్ కు కనపడేలా న్యాయవాదిని అనుమతి ఇవ్వాలని ఆదేశించింది హైకోర్టు. ఐఆర్ఆర్ ఎలైన్మెంట్ మార్పుతో హెరిటేజ్ కు లాభం చేకూరేలా చేశారని సీఐడీ ఆరోపించింది. ఇదే విషయాన్ని కోర్టుకు తెలిపింది.
Also Read : Tirumala Hundi : శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.53 కోట్లు
