YS Jagan : చంద్ర‌బాబు దోచుకున్న దొంగ‌

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ రెడ్డి

YS Jagan : ఏపీ – రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిప్పులు చెరిగారు. టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. 40 ఏళ్ల రాజ‌కీయ జీవితంలో ఆయ‌న చేసింది ఏమీ లేద‌ని, కేవ‌లం దోచు కోవ‌డం, దాచు కోవ‌డానికి మాత్ర‌మే ప‌ని చేశాడండూ మండిప‌డ్డారు ఏపీ సీఎం.

YS Jagan Slams Chandrababu

మోస పూరిత‌మైన పాల‌న చేయ‌డం త‌ప్పితే ప్ర‌జ‌ల‌కు చేసింది ఏమీ లేద‌న్నారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డ్డార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి(YS Jagan). జ‌న్మ‌భూమి క‌మిటీల నుంచి స్కిల్
డెవలప్‌మెంట్, ఫైబర్ గ్రిడ్ వరకు అన్ని విధాలుగా అవినీతి రాజ్య‌మేలింద‌ని ఆరోపించారు. అదే బడ్జెట్ ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను అమలు చేయడంలో చంద్ర‌బాబు విఫలమయ్యారని ధ్వ‌జ‌మెత్తారు.

బాబు టీం ఓ దొంగ‌ల ముఠా అని ఎద్దేవా చేశారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. గ‌తంలో ఇచ్చిన ఎన్నిక‌ల మేనిఫెస్టోను డ‌స్ట్ బిన్ లో ప‌డేశారంటూ ఫైర్ అయ్యారు. దోచు కోవ‌డం, దాచు కోవ‌డం, క‌బ‌ళించ‌డం ప్రాతిప‌దిక‌న పాల‌న సాగించార‌ని అంత‌కు మించి ఏ ఒక్క ప‌ని చేప‌ట్టిన దాఖ‌లాలు లేవ‌న్నారు. ఒక్క తాను ప్రాతినిధ్యం వ‌హించిన కుప్పంలోనే 20 వేల ఇళ్ల స్థ‌లాల‌ను పంపిణీ చేశామ‌ని పేర్కొన్నారు.

Also Read : YSR Awards : 27 మందికి వైఎస్సార్ అవార్డులు

Leave A Reply

Your Email Id will not be published!