Kodanda Ram : కాంగ్రెస్ కు కోదండ‌రామ్ మ‌ద్ద‌తు

ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం లేదు

Kodanda Ram : హైద‌రాబాద్ – తెలంగాణ జ‌న స‌మితి పార్టీ చీఫ్ ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈసారి రాష్ట్రంలో జ‌రిగే శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ పోటీ చేయ‌డం లేదంటూ వెల్ల‌డించారు. సోమవారం టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి టీజేఎస్ చీఫ్ కోదండ రామ్ ను క‌లుసుకున్నారు. త‌మ పార్టీకి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరారు.

Kodanda Ram Comment

ఈ మేర‌కు రేవంత్ రెడ్డి, కోదండ రామ్ లు భేటీ కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఈ మేర‌కు రాష్ట్రంలో చోటు చేసుకున్న ప‌రిణామాల గురించి చ‌ర్చించారు. భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ ఏమిట‌నే దానిపై చెబుతామ‌ని స్ప‌ష్టం చేశారు ఈ సంద‌ర్బంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.

ఎలాంటి కండీష‌న్లు లేకుండానే తెలంగాణ జ‌న స‌మితి పార్టీ కాంగ్రెస్ పార్టీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌బోతోంద‌ని పేర్కొన్నారు కోదండ‌రామ్(Kodanda Ram). గ‌తంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఇరు పార్టీల మ‌ధ్య ఒప్పందం ఉండేది. ఎన్నారై భ‌వానీ రెడ్డికి టికెట్ తో పాటు కోదండ రామ్ బ‌రిలో నిలిచారు. కానీ ఈసారి సీన్ మారింది.

మొత్తంగా తెలంగాణ జ‌న స‌మితి , కాంగ్రెస్ పార్టీ క‌లయిక‌తో రాష్ట్రంలో పెను మార్పు రాక పోయినా కొన్ని ప్రాంతాలలో ప్ర‌భావితం చేసే అవ‌కాశాలు లేక పోలేదు. వామ‌ప‌క్ష‌, తెలంగాణ భావ‌జాలం క‌లిగిన వాళ్లు, మేధావులు , బుద్ది జీవులు కొంద‌రు కోదండ రామ్ కు మ‌ద్ద‌తు ఇస్తార‌ని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.

Also Read : Ponguleti Srinivas Reddy : కేసీఆర్ జ‌మానా దోపిడీకి చిరునామా

Leave A Reply

Your Email Id will not be published!