AP High Court : చంద్ర‌బాబుకు హైకోర్టు కండీష‌న్స్

ష‌ర‌తులు పాటించ‌క పోతే సీరియ‌స్

AP High Court : అమ‌రావ‌తి – ఏపీ స్కిల్ స్కామ్ కేసులో అడ్డంగా బుక్కై రాజ‌మండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్ర‌బాబు నాయుడు 53 రోజుల త‌ర్వాత ముంద‌స్తు బెయిల్ పై విడుద‌ల‌య్యారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న రాజ‌మహేంద్ర‌వ‌రం నుంచి హైద‌రాబాద్ కు వ‌చ్చారు. త‌న క‌న్నుకు శ‌స్త్ర చికిత్స చేయించు కోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, బెయిల్ ఇవ్వాలంటూ కోరారు. దీంతో జ‌డ్జి బెయిల్ ఇచ్చేందుకు అనుమ‌తి ఇచ్చారు.

AP High Court Shock to Chandrababu

హైద‌రాబాద్ లో ఎలాంటి అనుమ‌తి తీసుకోకుండా భారీ ర్యాలీ చేప‌ట్టారు. దీంతో రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఎన్నిక‌ల కోడ్ అమ‌లులో ఉంది. దీనిని ఉల్లంఘించారంటూ కేసులు న‌మోదు చేశారు. బాబుతో పాటు టీడీపీ నేత‌ల‌పై కేసు న‌మోదు చేయ‌డం విశేషం.

ఇదిలా ఉండ‌గా చంద్ర‌బాబుపై మ‌రో 5 కేసులు న‌మోదు చేసింది ఏపీ సీఐడీ. 5 ష‌ర‌తుల‌తో కూడిన మ‌ధ్యంత‌ర బెయిల్ మంజూరు చేసింది. మ‌రో 5 కండీష‌న్స్ పెట్టాలంటూ సీఐడీ హైకోర్టులో(AP High Court) పిటిష‌న్ దాఖ‌లు చేసింది.

దీంతో విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు కీల‌క తీర్పు వెలువ‌రించింది. పాత ష‌ర‌తులు వ‌ర్తిస్తాయ‌ని పేర్కొంది. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. రాజ‌కీయ ప్ర‌సంగాలు చేయ‌కూడ‌ద‌ని , ర్యాలీలు నిర్వ‌హించ కూడ‌ద‌ని స్ప‌ష్టం చేసింది. కేసుల గురించి ఇత‌రుల‌తో మాట్లాడ కూడ‌ద‌ని తీర్పు చెప్పింది.

Also Read : YSRTP Protest : ష‌ర్మిల మోసం కార్య‌క‌ర్త‌ల ఆగ్ర‌హం

Leave A Reply

Your Email Id will not be published!