PM Modi Announce : ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం
కమిటీ ప్రకటించిన ప్రధాని మోదీ
PM Modi Announce : సికింద్రాబాద్ – దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంచలన ప్రకటన చేశారు. విశ్వ రూప మహా సభలో పాల్గొన్న ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ వర్గీకరణకు తాము కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. గత 30 ఏళ్లుగా తన జాతి కోసం నిరంతరం కష్ట పడుతున్న మందకృష్ణ మాదిగను చూస్తుంటే తనకు ఎంతో సంతోషం కలుగుతోందన్నారు.
PM Modi Announce for Special Committee
త్వరలోనే ఎస్సీ వర్గీకరణ కోసం కమిటీని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు మోదీ(PM Modi). ఎస్సీలకు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు . ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ఇలాంటి ఉద్యమకారుడిని కన్న తల్లిదండ్రులను ఈ సందర్బంగా అభినందిస్తున్నానని అన్నారు మోదీ.
ఇక నుంచి తాను మందకృష్ణ మాదిగతో కలిసి పని చేస్తానని, అతడికి అన్ని వేళలా అండగా ఉంటానని స్పష్టం చేశారు ప్రధాన మంత్రి. ఇవాళ లక్షలాదిగా తన కోసం తరలి వచ్చిన మీ అందరికి ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నట్లు చెప్పారు మోదీ.
ఇదిలా ఉండగా సభా ప్రాంగణంలో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. ప్రధానిని చూసి ఉద్వేగానికి లోనయ్యారు. కంటతడి పెట్టారు. చాలా సేపు తట్టుకోలేక పోయారు. దీంతో మందకృష్ణను ఓదార్చారు మోదీ.
Also Read : Yashasvini Reddy : పాలకుర్తి గడ్డ కాంగ్రెస్ అడ్డా