Rahul Gandhi : మధ్యప్రదేశ్ లో మాదే రాజ్యం
ఎంపీ రాహుల్ గాంధీ జోష్యం
Rahul Gandhi : మధ్యప్రదేశ్ – ఏఐసీసీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం దేశంలోని 5 రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్ లో విస్తృతంగా పర్యటించారు. ఈసందర్భంగా రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు రాష్ట్రంలో కొలువు తీరిన బీజేపీ సర్కార్ ను. తమకు 150కి పైగా సీట్లు వస్తాయని జోష్యం చెప్పారు. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని అన్నారు.
Rahul Gandhi Counter
మహిళలకు నెలకు రూ. 1500 పెన్షన్ ఇస్తామన్నారు. రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు రాహుల్ గాంధీ(Rahul Gandhi). రూ. 500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. గోధుమలకు సంబంధించి కనీస మద్దతు ధర రూ. 2,600 అందజేస్తామని తెలిపారు.
100 యూనిట్ల వరకు విద్యుత్ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు రాహుల్ గాంధీ. 200 యూనిట్లకు సగం వరకు మాత్రమే బిల్లులు చెల్లించేలా చూస్తామని తెలిపారు. పేదలు, రైతులు, యువత, మహిళలకు చేయూత ఇచ్చేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సునామీలో బీజేపీ తుడిచి పెట్టుకు పోవడం ఖాయమని అన్నారు రాహుల్ గాంధీ.
బీజేపీ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. అందుకే వారికి మూడిందని , తమ పార్టీకి ప్రజలు పట్టం కట్టేందుకు సిద్దమయ్యారని తెలిపారు రాహుల్ గాంధీ.
Also Read : Kaleshwaram Case : కాళేశ్వరం ప్రాజెక్టుపై కోర్టులో దావా