Election Commission Issues : రాహుల్ గాంధీకి ఈసీ షాక్
నోటీసులు జారీ చేసిన వైనం
Election Commission : న్యూఢిల్లీ – ఎన్నికలు జరుగుతున్న వేళ ఏఐసీసీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీకి కోలుకోలేని షాక్ ఇచ్చింది. గురువారం కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని పనిగట్టుకుని వ్యక్తిగత విమర్శలు చేశారంటూ ఫిర్యాదులు అందాయని పేర్కొంది.
Election Commission Issued Notice to Rahul Gandhi
ఆయనను ఉద్దేశించి ఐరెన్ లెగ్ అన్నారని, ఇది పూర్తిగా ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. అంతే కాకుండా జేబు దొంగ అంటూ యాడ్స్ రూపొందించడాన్ని కూడా ప్రత్యేకంగా ప్రస్తావించింది ఈసీ(EC).
ఇందుకు సంబంధించి రాహుల్ గాంధీకి డెడ్ లైన్ విధించింది. నవంబర్ 25 సాయంత్రం 6 గంటల లోపు సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది. లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని జారీ చేసిన నోటీసులో పేర్కొంది.
దీనిపై ఇంకా స్పందించ లేదు ఎంపీ రాహుల్ గాంధి. ఇదిలా ఉండగా తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనేందుకు రానున్నారు. ఈనెల 25, 26 తేదీలలో పలు నియోజకవర్గాలలో జరిగే సభలు, రోడ్ షోలలో పాల్గొననున్నారు. మొత్తంగా రాహుల్ ఎన్ని నోటీసులు జారీ చేసినా మోదీపై ఆరోపణలు చేయడం మానుకోవడం లేదు.
Also Read : JP Nadda : కాళేశ్వరం కేసీఆర్ కు ఏటీఎం