RS Praveen Kumar : రైతు బంధు మోసం ఓట‌ర్ల‌కు గాలం

ఎన్నిక‌ల సంఘం తీరుపై ఆర్ఎస్పీ ఫైర్

RS Praveen Kumar : హైద‌రాబాద్ – ఎన్నిక‌లు జ‌రుగుతున్న ప్ర‌స్తుత త‌రుణంలో నిస్సిగ్గుగా రైతు బంధుకు కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఎలా అనుమ‌తి ఇస్తుంద‌ని ప్ర‌శ్నించారు బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ చీఫ్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్(RS Praveen Kumar). ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రైతు బంధు పేరుతో ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేసేందుకు ఆస్కారం ఉంద‌ని పేర్కొన్నారు. ఈ ఒక్క నిర్ణ‌యంతో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్ఎస్ రెండూ ఒక్క‌టేన‌ని తేలి పోయింద‌ని ఎద్దేవా చేశారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్.

RS Praveen Kumar Comments about Ruthy Bandu

గ‌తంలో రైతు బంధు నిధుల‌ను ఎందుకు జ‌మ చేయ‌లేద‌ని ప్ర‌శ్నించారు. ఇప్ప‌టి దాకా నిలిపి వేస్తూ వ‌చ్చిన ఈసీ ఉన్న‌ట్టుండి పోలింగ్ ముందు రోజు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం దేనికి సంకేతం అంటూ మండిప‌డ్డారు . 2018లో కూడా ఇదే జ‌రిగింద‌ని, ఇది పూర్తిగా రాజ‌కీయ ప్ర‌భావం చూప‌డం త‌ప్ప మ‌రొక‌టి కాద‌ని ధ్వ‌జ‌మెత్తారు ఆర్ఎస్పీ.

ఈ ఎన్నిక‌ల్లో ఓట్ల కోసం న‌వంబర్ నెల‌లోనే రైతు బంధు సాయం విడుద‌ల చేయాల‌ని కోరుతూ కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి సీఎం కేసీఆర్ లేఖ రాయ‌డం పూర్తిగా స్వార్థ పూరితం త‌ప్ప మ‌రొక‌టి కాద‌ని ధ్వ‌జ‌మెత్తారు.

Also Read : EC Notice : కేసీఆర్ కామెంట్స్ ఈసీ సీరియ‌స్

Leave A Reply

Your Email Id will not be published!