Rahul Gandhi : మోదీతో ఓవైసీ..కేసీఆర్ దోస్తానా

ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ

Rahul Gandhi : న‌రేంద్ర మోదీ, ఓవైసీ, కేసీఆర్ ముగ్గురూ ఒక్క‌టేన‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ఏఐసీసీ మాజీ చీఫ్ , వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi). తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న ప్ర‌సంగించారు. బ‌య‌ట‌కు ఒక‌రిపై మ‌రొక‌రు తిట్టుకున్న‌ట్టు చేస్తార‌ని కానీ లోలోప‌ట ఈ ముగ్గురూ ఒక్క‌టేన‌ని ఎద్దేవా చేశారు. ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నార‌ని వీరికి త‌గిన రీతిలో గుణ‌పాఠం చెప్ప‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు.

Rahul Gandhi Comment

పార్ల‌మెంట్ లో ప్ర‌జా వ్య‌తిరేక విధానాల గురించి ఏనాడూ గొంతెత్తిన పాపాన పోలేద‌న్నారు. వీళ్లు తెలంగాణ ప్ర‌జ‌ల ప‌ట్ల ప్రేమ ఎందుకు క‌లిగి ఉంటార‌ని ప్ర‌శ్నించారు. అందుకే లిక్క‌ర్ స్కామ్ లో ఇరుక్కున్నా త‌న కూతురును కేసీఆర్ ర‌క్షించు కోగ‌లిగార‌ని అన్నారు. తెలంగాణలో సీఎంగా కేసీఆర్ ఉండాల‌ని కోరుకుంటున్నార‌ని వీరి బంధం ఫెవికోల్ కంటే బ‌ల‌మైన‌ద‌ని ఎద్దేవా చేశారు రాహుల్ గాంధీ.

త‌న‌పై ఎన్ని నిరాధార‌మైన కేసులు న‌మోదు చేసినా, త‌న‌ను ఎంత‌గా అడ్డుకోవాల‌ని చూసినా వ‌ర్క‌వుట్ కాద‌న్నారు. తాను ఫీనిక్స్ ప‌క్షి లాంటి వాడిన‌ని త‌ల‌వంచే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. మోడీ తీరు మార‌నంత వ‌ర‌కు తాను పోరాడుతూనే ఉంటాన‌ని ప్ర‌క‌టించాడు. ఎవ‌రికీ భ‌య‌ప‌డే నైజం నాలో లేద‌ని పేర్కొన్నారు రాహుల్ గాంధీ.

Also Read : Sitaram Yechuri : క‌మ‌లం..కారు రెండూ ఒక్క‌టే

Leave A Reply

Your Email Id will not be published!